Pallavi Prashanth : బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్
బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు.

Bigg Boss Winner Pallavi Prashanth Arrested
Pallavi Prashanth : బిగ్‌బాస్ సీజన్ 7లో విన్నర్ పల్లవి ప్రశాంత్ పేరు గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగ వినిపిస్తుంది. ఈ ఆదివారం నాడు బిగ్‌బాస్ ఫైనల్ పూర్తి చేసుకొని హౌస్ నుంచి కంటెస్టెంట్స్ బయటకి వస్తుంటే కొందరు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్, అశ్విని, గీతూ, హర్ష, భోలే.. కార్లు పగలకొట్టి వారిని భయపెట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. అంతేకాదు పోలీసులు లా & ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పినా ప్రశాంత్ వినకుండా పోలీస్ వారితో గొడవ పెట్టుకొని ఊరేగింపుగా వెళ్ళాడు. దీంతో పల్లవి ప్రశాంత్ అభిమానులు రెచ్చిపోయి నానా హంగామా చేశారు.
ఈ హంగామాలో కొన్ని పోలీస్ వాహనాలు, ప్రైవేట్ వాహనాలు, గవర్నమెంట్ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రశాంత్ ని A1 గా, అతని తమ్ముడిని A2 గా చేర్చి మీడియా వీడియోలు, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దాడులకు పాల్పడ్డ వారిని గుర్తిస్తున్నారు. నిన్న రాత్రి ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పల్లవి ప్రశాంత్ ని కూడా అరెస్ట్ చేయనున్నారని తెలుసుకున్న ప్రశాంత్.. పరారీ ఉన్నాడని, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి కనబడకుండా తిరుగుతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ తాను ఎక్కడికి పారిపోలేదని ప్రశాంత్ వీడియో రిలీజ్ చేయడంతో తాను తన ఇంటి దగ్గరే ఉన్నాడని తెలిసిందే.
Also read : Sandeep Vanga : బాలీవుడ్‌లో కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి.. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇతర సినిమాలపై..
తాజాగా ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారట. గజ్వేల్ మండలంలోని కొల్గూర్ గ్రామంలో తన ఇంటి వద్ద ఉన్న పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అదుపులో తీసుకున్నారట. అక్కడ అరెస్ట్ చేసిన ప్రశాంత్ ని జూబ్లీ హిల్స్ పోలిస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ గొడవ ఎక్కడికి వెళ్తుందో చూడాలి. మరో పక్క హైకోర్టులో నాగార్జున పై కూడా పిటిషన్ దాఖలు అయ్యిందట. నాగార్జునని వెంటనే అరెస్ట్ చేయాలని కోర్టులో పేర్కొన్నారట.