Bobby Deol : ఇదేంట్రా నాయనా.. బర్త్ డేకి ఎవరన్నా కేక్ తెస్తారు.. వీళ్లేంటి ఇంత పెద్ద లడ్డూ తెచ్చారు హీరో కోసం..

నేడు బాబీ డియోల్ తన ఫ్యాన్స్ తో కలిసి పుట్టిన రోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు.

Bobby Deol : ఇదేంట్రా నాయనా.. బర్త్ డేకి ఎవరన్నా కేక్ తెస్తారు.. వీళ్లేంటి ఇంత పెద్ద లడ్డూ తెచ్చారు హీరో కోసం..

Bobby Deol fans gives 12kg Laddu on his Birthday Video goes Viral

Updated On : January 27, 2025 / 5:22 PM IST

Bobby Deol : హీరోల పుట్టిన రోజులు వస్తే అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారని తెలిసిందే. కొంతమంది సెలబ్రిటీలు తమ అభిమానులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటారు. నేడు బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాబీ డియోల్ తన ఫ్యాన్స్ తో కలిసి పుట్టిన రోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ క్రమంలో పలువురు ఫ్యాన్స్ రకరకాల కేకులు, పెద్ద కేకులు, బాబీ డియోల్ సినిమాలు, ఫోటోల డిజైన్స్ తో ఉన్న కేకులు తీసుకొచ్చారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఓ పెద్ద లడ్డుని తీసుకొచ్చారు. దాదాపు 12 కేజీల లడ్డూని తీసుకొచ్చారు బాబీ డియోల్ కోసం. దీంతో మిగిలిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కేక్స్ తీసుకెళ్లడం, చిన్న స్వీట్స్ తీసుకెళ్లడం మాములే పెద్ద లడ్డూ పుట్టిన రోజుకి తీసుకురావడం డిఫరెంట్ అంటూ బాబీ ఫ్యాన్స్ ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు.

Also See : బాలయ్య – ఊర్వశి రౌతేలా ‘దబిడి దబిడి..’ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూశారా?

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర తనయుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మారాడు బాబీ డియోల్. కానీ కొన్ని వరుస ఫ్లాప్స్ రావడంతో కొన్నాళ్ళు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారినా ఎక్కువగా ఛాన్సులు రాలేదు. డబ్బులు లేకపోవడం, ఇంట్లో కొడుకుతో కూడా మాటలు అనిపించుకోవడంతో ఒకానొక సమయంలో చనిపోదాం అనుకున్నాడు. కానీ యానిమల్ సినిమాలో సందీప్ రెడ్డి వంగ పవర్ ఫుల్ విలన్ రోల్ ఇచ్చి తన లైఫ్ ని నిలబెట్టాడని బాబీ తెలిపాడు.

Also Read : Rashmika Mandanna : రిలీజ్ కి ముందే రష్మిక సినిమాపై విమర్శలు.. దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్..

యానిమల్ సినిమా నుంచి వరుసగా బాలీవుడ్, టాలీవుడ్, తమిళ్ లో విలన్ గా రోల్స్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు బాబీ డియోల్. ఇటీవల సంక్రాంతికి బాలయ్య డాకు మహారాజ్ సినిమాలో కూడా విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు స్టైలిష్ విలన్ అంటే ముందు బాబీ డియోల్ గుర్తుకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, విజయ్ లాస్ట్ సినిమాల్లో కూడా బాబీ డియోల్ నెగిటివ్ పాత్రల్లో నటిస్తున్నాడు. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తున్నాడు.