Nawazuddin Siddiqui : మొన్న భార్య, ఇవాళ పనిమనిషి.. వేధిస్తున్నాడు అంటూ నటుడు పై పిర్యాదు.. వీడియో వైరల్!

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ పై ముంబై పోలీసులకు వరుస ఆరోపణలు వస్తున్నాయి. గత కొంత కాలంగా నవాజుద్దీన్ అతని భార్య చేసిన ఆరోపణలకు కోర్ట్ మెట్లు ఎక్కుతూ ఉన్నాడు.

Nawazuddin Siddiqui : మొన్న భార్య, ఇవాళ పనిమనిషి.. వేధిస్తున్నాడు అంటూ నటుడు పై పిర్యాదు.. వీడియో వైరల్!

bollywood actor Nawazuddin Siddiqui alleged by house maid after his wife Aaliya Siddiqui

Updated On : February 19, 2023 / 9:32 PM IST

Nawazuddin Siddiqui : బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ పై ముంబై పోలీసులకు వరుస ఆరోపణలు వస్తున్నాయి. గత కొంత కాలంగా నవాజుద్దీన్ అతని భార్య చేసిన ఆరోపణలకు కోర్ట్ మెట్లు ఎక్కుతూ ఉన్నాడు. అతని భార్య అలియా సిద్ధిఖీ.. నవాజుద్దీన్ తనని వేధిస్తున్నాడు అంటూ ఇటీవల ముంబై పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు ప్రస్తుతం కోర్ట్ లో నడుస్తుంది. తాజాగా ఈ కేసు విచారణలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. నవాజుద్దీన్ తన ఇంటి పనిమనిషిని కూడా వేధిస్తున్నట్లు ఒక వీడియో కోర్ట్ ముందుకు వచ్చింది.

CCL 2023 : కేరళ పై తెలుగు వారియర్స్ విక్టరీ.. అఖిల్ అక్కినేని స్కోర్ ఎంతో తెలుసా?

నవాజుద్దీన్ అతని కుటుంబంతో కలిసి దుబాయిలో ఉంటున్నాడు. కొన్ని రోజులు ముందు వరకు అలియా సిద్ధిఖీ అక్కడే అతనితో పాటు నివసిస్తూ వచ్చింది. కాగా దుబాయ్ లో తన పిల్లలని చూసుకోడానికి సప్నా అనే ఒక అమ్మాయిని 2022 నవంబర్‌లో నియమించుకున్నారు. అయితే వీసా ఫీజుల పేరుతో గత కొంత కాలంగా నవాజుద్దీన్ తనకి జీతం కూడా ఇవ్వడం లేదని. ప్రస్తుతం తన దగ్గర తినడానికి కూడా తిండి లేదని. తనని కాపాడి భారతదేశానికి తిరిగి తీసుకు వెళ్ళండి అంటూ అధికారులను వేడుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది.

ఈ వీడియోని నవాజుద్దీన్ భార్య ఆలియా తరఫు న్యాయవాది కోర్ట్ వారి ముందు పెట్టాడు. ఆమెను వెంటనే రక్షించాలి అంటూ కోర్ట్ వారిని కోరాడు. న్యాయవాది రిజ్వాన్ స్పందిస్తూ సప్నాని వెంటనే భారతదేశానికి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి అంటూ అధికారులను ఆదేశించారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.