Urfi Javed : మొత్తం విశ్వాన్ని తన డ్రెస్సులో పెట్టేసిన ఉర్ఫీ జావేద్.. ఈ డిఫరెంట్ డ్రెస్ చూశారా..!
సూర్యుడు చుట్టూ తిరిగి తొమ్మిది గ్రహాలను తన చుట్టూ తిప్పుకుంటూ ఉర్ఫీ ఆ డ్రెస్సుని రెడీ చేయించారు. ఇక ఈ డ్రెస్ ధరించి ముంబై వీధుల్లోకి వచ్చిన ఉర్ఫీని చూసి..

Bollywood Actress Urfi Javed new design wear dress gone viral
Urfi Javed : బాలీవుడ్ లో తన డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ తో సోషల్ మీడియాలో సూపర్ ఫేమ్ ని సంపాదించుకున్న భామ ‘ఉర్ఫీ జావేద్’. రకరకాల వస్తువులతో డ్రెస్సులను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకొని, వాటిని ధరించి ముంబై వీధుల్లో తిరుగుతూ సందడి చేస్తుంటారు. ఇక అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఉర్ఫీ డ్రెస్ వావ్ అనిపించినా.. మరికొన్నిసార్లు మాత్రం చిరాకు తెప్పిస్తుంది.
తాజాగా ఈ భామ.. మొత్తం విశ్వాన్ని తన డ్రెస్సులో పెట్టేసి డిజైన్ చేయించుకొంది. సూర్యుడు చుట్టూ తిరిగి తొమ్మిది గ్రహాలను తన చుట్టూ తిప్పుకుంటూ ఉర్ఫీ ఆ డ్రెస్సుని రెడీ చేయించారు. ఇక ఈ డ్రెస్ ధరించి ముంబై వీధుల్లోకి వచ్చిన ఉర్ఫీని చూసిన ప్రజలంతా వావ్ ఫీల్ అయ్యారు. ఈ డ్రెస్ ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉందని ఫీల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also read : Fahadh Faasil : బాహుబలి నిర్మాణ సంస్థలో ఫహద్ ఫాజిల్ కొత్త సినిమాలు.. బాలయ్య డైలాగ్‌తో ఒక సినిమా టైటిల్..
View this post on Instagram
ఇక ఈ వీడియో నెటిజెన్స్ సరదా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. సైన్స్ ఎగ్జిబిషన్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటిన్ ఉన్నప్పుడు ఈ డ్రెస్ బాగా అవసరం పడుతుంది. ఉర్ఫీ తన డ్రెస్సింగ్ స్టైల్ తో మనల్ని షాక్ చేయడంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వదు అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కాగా ఉర్ఫీ హిందీ బిగ్ బాస్ తో బాలీవుడ్ లో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఆ తరువాత సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోషూట్స్ తో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.