Richa Chadda : భారత్ సైన్యంపై ట్వీట్.. వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ బ్యూటీ..

బాలీవుడ్ బ్యూటీ 'రిచా చద్దా' తీవ్ర వివాదంలో చిక్కుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చేసిన ప్రకటనపై రిచా చద్దా తన ట్విట్టర్ ద్వారా స్పందించింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారానికి దారి తీసిని.

Richa Chadda : భారత్ సైన్యంపై ట్వీట్.. వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ బ్యూటీ..

Bollywood beauty Richa Chadda embroiled in controversy for tweet insulting Indian Army

Updated On : November 25, 2022 / 10:37 AM IST

Richa Chadda : బాలీవుడ్ బ్యూటీ ‘రిచా చద్దా’ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చేసిన ప్రకటనపై రిచా చద్దా తన ట్విట్టర్ ద్వారా స్పందించింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారానికి దారి తీసిని.

Pushpa : నార్త్‌లోను ‘పుష్ప’దే హవా.. మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ లిస్ట్ విడుదల చేసిన ఆర్మాక్స్ మీడియా..

రిచా తన ట్విట్టర్ లో.. ‘గాల్వాన్ సేస్ హాయ్’ అని ట్వీట్ చేసింది. భారతదేశం మరియు చైనాల మధ్య 2020 గాల్వాన్ ఘర్షణలో భారత జవాన్ల త్యాగాన్ని ఎగతాళి చేసేలా ఆమె ట్వీట్ ఉందంటూ నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. దీనిపై బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా కూడా స్పందిస్తూ.. ‘అవమానకరమైన ట్వీట్, వీలైనంత త్వరగా ఉపసంహరించుకోవాలి. మన సాయుధ బలగాలను అవమానించడం సమంజసం కాదు’ అంటూ హెచ్చరించాడు.

కాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడమే భారత్ లక్ష్యమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మంగళవారం ఒక ప్రకటనలో.. జమ్మూకశ్మీర్‌, లడఖ్‌లలో తమ అభివృద్ధి పనులు గురించి వెల్లడించాడు. మరి ‘రిచా చద్దా’ ఈ ఆగ్రహజ్వాలలు ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.