NTR: ఎన్టీఆర్ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ.. ఈ వార్తలకు చెక్ పడేది ఎప్పుడు..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న NTR31 మూవీలో ఓ బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

NTR: ఎన్టీఆర్ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ.. ఈ వార్తలకు చెక్ పడేది ఎప్పుడు..?

Bollywood Beauty Shraddha Kapoor To Romance NTR In NTR31

Updated On : May 8, 2023 / 7:51 AM IST

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తన కెరీర్‌లోని 30వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మరోసారి తారక్ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని.. ఈ సినిమాతో కొరటాల-ఎన్టీఆర్ కాంబినేషన్ మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

NTR : ఖమ్మంలో ఎన్టీఆర్ భారీ విగ్రహం

ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే, తన నెక్ట్స్ మూవీని కూడా అనౌన్స్ చేశాడు ఈ నందమూరి హీరో. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు గతంలోనే ప్రకటించాడు. ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే అనౌన్స్‌మెంట్‌తోనే ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రీ-లుక్ పోస్టర్‌తో ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

NTR31: ఎన్టీఆర్‌తో సినిమాను అప్పుడే మొదలుపెడతానంటోన్న ప్రశాంత్ నీల్..?

ఇప్పటికే ఈ సినిమా కథ ఇదేనంటూ పలు వార్తలు నెట్టింట వైరల్ కాగా, ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ విషయంలోనూ అనేక వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించబోతుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. గతంలో మరో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఈ సినిమాలో నటిస్తుందనే వార్త వైరల్ అయ్యింది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై అభిమానుల్లో చర్చ సాగుతోంది. కాగా, ఈ వార్తలకు చిత్ర యూనిట్ ఎప్పుడు చెక్ పెడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా కథను ఇండియా-పాక్ బోర్డర్ నేపథ్యంలో తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.