Dinesh Phadnis : పాపులర్ సీనియర్ నటుడు, CID సిరీస్ ఫేమ్ దినేష్ ఫడ్నిస్ కన్నుమూత..

57 ఏళ్ళ వయసులో దినేష్ ఫడ్నిస్ కు డిసెంబర్ 1న హార్ట్ ఎటాక్ రావడంతో ఆయనను వెంటనే ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ కి తరలించారు.

Dinesh Phadnis : పాపులర్ సీనియర్ నటుడు, CID సిరీస్ ఫేమ్ దినేష్ ఫడ్నిస్ కన్నుమూత..

Bollywood CID Fame Dinesh Phadnis Passes away

Dinesh Phadnis : ఇప్పుడంటే ఓటీటీల ద్వారా వెబ్ సిరీస్ లు వచ్చాయి కానీ ఒకప్పుడు యూత్ కూడా టెలివిజన్ లో వచ్చే పలు సీరియల్స్ ని, సిరీస్ లని కచ్చితంగా ఫాలో అయ్యవారు. అప్పటి యూత్ కి బాగా కనెక్ట్ అయిన సస్పెన్స్ సీరియల్ ‘సిఐడీ’. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సీరియల్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. జనరల్ ఆడియన్స్ కి క్లూస్ అండ్ ఫోరెన్సిక్ విభాగాన్ని పరిచయం చేసింది ఈ సీరియలే.

బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సీరియల్ సౌత్ లోని పలు లాంగ్వేజ్స్ లో కూడా డబ్ వెర్షన్ తో స్ట్రీమ్ అయ్యింది. ఇక ఈ సీరియల్ లో ‘ఫ్రెడెరిక్స్’ అనే పాత్రని పోషించిన దినేష్ ఫడ్నిస్ కి కూడా మంచి పేరు వచ్చింది. ఆయనకు ఈ సీరియల్ తర్వాత మరిన్ని అవకాశాలు వచ్చాయి. అయితే ఆయన ఇటీవల అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. 57 ఏళ్ళ వయసులో దినేష్ ఫడ్నిస్ కు డిసెంబర్ 1న హార్ట్ ఎటాక్ రావడంతో ఆయనను వెంటనే ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ కి తరలించారు.

Also Read : Guntur Kaaram Update : కేరళకు గుంటూరు కారం.. అప్ డేట్ ఇచ్చిన టీమ్

దినేష్ ఫడ్నిస్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ నేడు డిసెంబర్ 5న తెల్లవారు జామున మరణించారు. హార్ట్ అటాక్ తో పాటు లివర్ ప్రాబ్లమ్ కూడా రావడంతో చికిత్స తీసుకుంటూ మరణించారు. అతనితో పాటు CIDలో కలిసి నటించిన మారియో నటుడు దయానంద్ శెట్టి ఈ విషయంన్ని మీడియాకు కంఫర్మ్ చేశారు. దీంతో CID సీరియల్ అభిమానులు, నెటిజన్లు, పలువురు బాలీవుడ్ ప్రముఖులు దినేష్ ఫడ్నిస్ కు నివాళులు అర్పిస్తున్నారు.