Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీ దూకుడు.. వచ్చే ఏడాది కూడా నాదే!
కొవిడ్ రాని.. ఇంకేదైనా కానీ.. తగ్గేదేలే అంటూ ఫోజులు కొడుతున్నాడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం ఇండియన్ హీరోల్లో ఎవ్వరికీ సాధ్యం కాని ఫీట్ చేసి చూపిస్తున్నాడు. 55కు చేరువలో ఉన్నా..
Akshay Kumar: కొవిడ్ రాని.. ఇంకేదైనా కానీ.. తగ్గేదేలే అంటూ ఫోజులు కొడుతున్నాడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం ఇండియన్ హీరోల్లో ఎవ్వరికీ సాధ్యం కాని ఫీట్ చేసి చూపిస్తున్నాడు. 55కు చేరువలో ఉన్నా యంగ్ హీరోలకు నిద్రలేకుండా కమిట్మెంట్స్ ఇస్తున్నాడు. 2021లో సైతం హైస్పీడ్ చూపించిన బాలీవుడ్ ఖిలాడీ 2022 నాదే అంటున్నాడు. మంచి దూకుడు చూపిస్తున్నాడు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. కెరీర్ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు. 2021లో అక్షయ్ బెల్ బాటమ్.. థియేటర్స్ లో రిలీజైన తర్వాతే మిగిలిన వారు ధైర్యం చేసారు. తర్వాత సూర్యవంశీతో 100 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసి బాలీవుడ్ మూవీని పరుగులు పెట్టించాడు. అటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన అత్రంగీ రే సూపర్ హిట్ తో స్ట్రీమింగ్ అవుతోంది.
Samantha: టాలీవుడ్ టూ హాలీవుడ్.. టాప్ గేర్‌లో దూసుకుపోతున్న సామ్!
2022లో పృధ్వీరాజ్ మూవీతో బోణీ కొట్టబోతున్నాడు అక్షయ్ కుమార్. రాజ్ పుత్ కింగ్ పృధ్వీరాజ్ చౌహాన్ గా అక్షయ్ నటిస్తోన్న ఈ మూవీ జనవరి 21న డేట్ ఫిక్స్ చేసుకుంది. క్రైమ్ కామెడీ జానర్ లో బచ్చన్ పాండేను మార్చి 4న థియేటర్స్ లో తీసుకురాబోతున్నాడు. సోషల్ కామెడీ రక్షాబంధన్ ఆగస్ట్ 11న రిలీజ్ కాబోతుంది. మరోవైపు రామ్ సేతు ప్రాజెక్ట్ ను రెడీ చేస్తున్నాడు. వీటతో పాటే మిషన్ సిండ్రెల్లా, ఓ మై గాడ్ 2 సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. సూర్య ఆకాశమే నీ హద్దురా రీమేక్ కూడా చేతిలో ఉంది.
Allu Arjun: నువ్వు లేక నేను లేను.. సుకుమార్‌ను తలచుకొని ఏడ్చేసిన బన్నీ!
సినిమాలే కాదు అమెజాన్ ప్రైమ్ కోసం ది ఎండ్ అనే యాక్షన్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో మాక్సిమమ్ 2022లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. థ్రియేట్రికల్ రైట్స్, శాటీలైట్, డిజిటల్ రైట్స్ కలుపుకుంటే అన్నింటికి దాదాపు 2000 వేల కోట్లకు పైగా బిజినెస్ జరగనుంది. ఒక్క హీరో ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్… అది కూడా కేవలం సంవత్సరంలో చేయడం రికార్డే.