Emraan Hashmi : మొన్న పవన్ కళ్యాణ్ కోసం.. ఇవాళ అడివి శేష్ కోసం.. తెలుగు ఇండస్ట్రీలోకి బాలీవుడ్ రొమాంటిక్ హీరో..

ఒకప్పుడు రొమాంటిక్ హీరోగానే సినిమాలు చేసిన ఇమ్రాన్ హష్మీ గత కొన్నాళ్లుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కొత్త తరహా పాత్రలతో వస్తున్నాడు.

Emraan Hashmi : మొన్న పవన్ కళ్యాణ్ కోసం.. ఇవాళ అడివి శేష్ కోసం.. తెలుగు ఇండస్ట్రీలోకి బాలీవుడ్ రొమాంటిక్ హీరో..

Bollywood Star Emraan Hashmi Playing Key Roles in Pawan Kalyan OG and Adivi Sesh Goodachari 2 Movies

Updated On : February 15, 2024 / 4:49 PM IST

Emraan Hashmi : బాలీవుడ్(Bollywood) రొమాంటిక్ హీరో అంటే మొదట గుర్తొచ్చేది ఇమ్రాన్ హష్మీనే. బాలీవుడ్ లో బోల్డ్ సినిమాలకు పెట్టింది పేరు ఇమ్రాన్ హష్మీ. ఒకానొక టైంలో లిప్ కిస్, రొమాన్స్ సీన్స్ లేకుండా ఇమ్రాన్ హష్మీ సినిమా ఉండేది కాదు. ఇప్పుడు ఈ రొమాంటిక్ హీరో తెలుగు సినిమాల మీద పడ్డాడు.

ఒకప్పుడు రొమాంటిక్ హీరోగానే సినిమాలు చేసిన ఇమ్రాన్ హష్మీ గత కొన్నాళ్లుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కొత్త తరహా పాత్రలతో వస్తున్నాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల తెలుగులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) OG సినిమాలో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు అంటూ ప్రకటించారు. OG సినిమాలో ఇమ్రాన్ విలన్ పాత్రలో కనిపించబోతాడని సమాచారం.

తాజాగా మరో తెలుగు సినిమాలో ఇమ్రాన్ హష్మీ నటించబోతున్నాడు. చిన్న సినిమాలతో పెద్ద హిట్స్ కొట్టే అడివి శేష్(Adivi Sesh) తన గూఢచారి(Goodachari) సినిమాకు సీక్వెల్ గా G2 అనే సినిమాతో పాన్ ఇండియా వైడ్ త్వరలో రాబోతున్నాడు. ప్రస్తుతం G2 సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.

Also Read : Sundaram Master Trailer : సుందరం మాస్టర్ ట్రైలర్ చూశారా? కామెడీ అనుకున్నాం కానీ.. సీరియస్ సినిమానే..

G2 సినిమా నుంచి ఇమ్రాన్ హష్మీ పోస్టర్ షేర్ చేస్తూ అడివి శేష్.. G2 యూనివర్స్ లోకి బ్రిలియంట్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీకు స్వాగతం. మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను అని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. దీనికి ఇమ్రాన్ హష్మీ రిప్లై ఇస్తూ.. సర్ అని పిలుస్తూ ఫార్మాలిటీస్ అవసర్లేదు, ఇమ్రాన్ అని పిలువు. మీ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. త్వరలో కలుద్దాం అని పోస్ట్ చేసారు. ఈ సినిమాలో కూడా ఇమ్రాన్ విలన్ గానే నటించబోతున్నట్టు సమాచారం. దీంతో ఇమ్రాన్ హష్మీ ఇప్పుడు వైరల్ గా మారారు. ఇన్నాళ్లు బాలీవుడ్ లో చక్రం తిప్పిన ఇమ్రాన్ హష్మీ ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ అవుతున్నాడు.