Amitabh Bachchan : అమితాబ్‌ బచ్చన్‌‌కి అస్వస్థత.. సర్జరీ కోసం ఆస్పత్రిలో..

అస్వస్థతకు గురైన అమితాబ్‌ బచ్చన్‌‌. సర్జరీ కోసం ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఎక్స్‌(ట్విటర్‌)లో అమితాబ్ చేసిన ట్వీట్..

Amitabh Bachchan : అమితాబ్‌ బచ్చన్‌‌కి అస్వస్థత.. సర్జరీ కోసం ఆస్పత్రిలో..

Bollywood star hero Amitabh Bachchan was Hospitalised

Updated On : March 15, 2024 / 4:12 PM IST

Amitabh Bachchan : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు (మార్చి 15) ఉదయం ముంబయిలోని కోకిలాబెన్‌ హాస్పిటల్ లో అయన అడ్మిట్ అయ్యినట్లు సమాచారం. కొన్ని రిపోర్టులు ప్రకారం బిగ్ బి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయ్యి అమితాబ్ హాస్పిటల్ జాయిన్ అయ్యారని, మరికొన్ని రిపోర్టులు చెబుతున్న విషయం ఏంటంటే.. కాలు సర్జరీ కోసం జాయిన్ అయ్యినట్లు చెబుతున్నాయి.

మరి ఈ వార్తలు ఏది నిజమో తెలియాలంటే అమితాబ్ టీం నుంచి క్లారిటీ రావాల్సిందే. ఇది ఇలా ఉంటే, మార్నింగ్ నుంచి ఈ వార్త వైరల్ అవ్వడంతో.. సోషల్ మీడియాలో బిగ్ బి అభిమానులు కంగారు పడుతూ పోస్టులు వేశారు. ఇక ఈరోజు మధ్యాహ్న సమయంలో అమితాబ్ తన ఎక్స్‌(ట్విటర్‌)లో.. ‘ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ చూసిన అభిమానులు.. అనారోగ్యం విషయం గానే అమితాబ్ ఈ ట్వీట్ చేసుంటారని భావిస్తున్నారు.

Also read : Tantra Movie Review : తంత్ర మూవీ రివ్యూ.. అనన్య నాగళ్ళ భయపెట్టిందా..?