Manoj Muntashir Shukla : మళ్ళీ ఆదిపురుష్ వివాదాన్ని గుర్తుచేసిన రచయిత.. నేను తప్పు చేశాను అంటూ రైటర్ మనోజ్ కామెంట్స్..

సినిమా వచ్చి నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆదిపురుష్ వివాదం గురించి స్పందించాడు మనోజ్ ముంతాషీర్ శుక్ల. తాజాగా బాలీవుడ్ లో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్ వివాదం గురించి మాట్లాడాడు.

Manoj Muntashir Shukla : మళ్ళీ ఆదిపురుష్ వివాదాన్ని గుర్తుచేసిన రచయిత.. నేను తప్పు చేశాను అంటూ రైటర్ మనోజ్ కామెంట్స్..

Bollywood Writer Manoj Muntashir Shukla Comments on Adipurush Dialogues Issue

Updated On : November 10, 2023 / 4:54 PM IST

Manoj Muntashir Shukla : ప్రభాస్(Prabhas), కృతి సనన్(Kriti Sanon) మెయిన్ లీడ్స్ లో రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’ జూన్ 16న థియేటర్స్ లోకి వచ్చింది. ఇందులో సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటించాడు. ముందు నుంచి ఈ సినిమాని రామాయణం అని ప్రమోట్ చేసి.. సినిమాలో రామాయణం ఛాయలు కనపడకపోవడంతో నెటిజన్లు, అభిమానులు, ప్రేక్షకులు ఆదిపురుష్ సినిమాపై, డైరెక్టర్ ఓం రౌత్ పై, విమర్శలు చేశారు. ఇక ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ కూడా తప్పుగా ఉన్నాయంటూ రచయిత మనోజ్ ముంతాషీర్ శుక్లపై కూడా దారుణంగా ట్రోల్స్ వచ్చాయి.

ఆ సమయంలో రచయిత ఈ వివాదానికి ఆజ్యం పోస్తూ.. తన డైలాగ్స్ ని మొదట సమర్ధించుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో అయితే అసలు ఇది రామాయణమే కాదు అనేశాడు. ఆ తర్వాత తీవ్ర వ్యతిరేకత రావడంతో చిత్రయూనిట్ కొన్ని డైలాగ్స్ ని మార్చింది. అప్పుడు రచయిత మనోజ్ శుక్లా.. నేను 4000 లైన్లకు పైగా డైలాగ్స్ రాస్తే మీకు 5 లైన్స్ లో మాత్రం సెంటిమెంట్లు దెబ్బ తిన్నాయి. శ్రీరాముడు, సీత గురించి సినిమా అంతా నేను రాసిన దానికి ప్రశంసలు రాలేదు. నా సొంత వాళ్ళే నాపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో రాశారు అంటూ సుదీర్ఘంగా ఓ పోస్ట్ పెట్టి ఆ వివాదాన్ని ముగించాడు.

సినిమా వచ్చి నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆదిపురుష్ వివాదం గురించి స్పందించాడు మనోజ్ ముంతాషీర్ శుక్ల. తాజాగా బాలీవుడ్ లో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్ వివాదం గురించి మాట్లాడాడు.

Also Read : Jigarthanda Double X : జిగర్‌తండా డబల్ ఎక్స్ సినిమా రివ్యూ.. సాగదీస్తూనే ఎమోషన్ తో ఏడిపించి..

మనోజ్ ముంతాషీర్ శుక్ల మాట్లాడుతూ.. సినిమా కోసం బాగా డైలాగ్స్ రాశానని, నన్ను నేను పొగుడుకొను. రాముడు, సీత, హనుమంతుడు.. సనాతన ధర్మాన్ని తప్పుగా చూపించాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. కాకపోతే నేను పెద్ద తప్పే చేశాను. ఆ ఘటన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఇకపై మరింత జాగ్రత్తగా రాస్తాను. ఆ వివాదం సమయంలో నేను సరిగ్గా స్పందించలేకపోయాను అది కూడా నా తప్పే అని అన్నాడు. దీంతో మరోసారి మనోజ్ శుక్ల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ప్రభాస్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.