Alia – Ranbir : దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్.. ఉత్తమ నటీనటులుగా రణ్బీర్, అలియా..
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు 'దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్'. కాగా ఈ పురస్కారంలో ఉత్తమ నటుడిగా ఉత్తమ నటీనటులుగా రణ్బీర్, అలియా అవార్డులు అందుకున్నారు.

Alia - Ranbir
Alia – Ranbir : భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్’. ఈ అవార్డుని అందుకోవడం తమ జీవిత సాఫల్యంగా భావిస్తారు నటులు మరియు సాంకేతిక నిపుణులు. ఇక ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా ఈ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల పురస్కారం ముంబైలో నేడు ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో పలువురు స్టార్స్ అలియా భట్, వరుణ్ ధావన్, అనుపమ్ ఖేర్, రేఖ దుల్కర్ సల్మాన్ తో పాటు కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి తదితరులు హాజరయ్యి సందడి చేశారు.
Alia Bhatt : ఇన్స్టాగ్రామ్లో కూతురు ఫోటో షేర్ చేసిన అలియా?
కాగా ఈ పురస్కారంలో ఉత్తమ నటుడిగా ఉత్తమ నటీనటులుగా రణ్బీర్, అలియా అవార్డులు అందుకున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు గాను రణ్బీర్ ఈ అవార్డుని అందుకున్నాడు. ప్రస్తుతం తను యానిమల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉండడంతో అవార్డ్ అందుకోడానికి రాలేకపోయాడు. దీంతో ఈ అవార్డుని అతని భార్య అలియా భట్ అందుకుంది. అలాగే ‘గంగూబాయి కతియావాడి’ మూవీకు గాను అలియా ఉత్తమ్ నటిగా అవార్డుని కైవసం చేసుకుంది. పెళ్లి అయిన తరువాత ఇద్దరికీ ఇలా ఒకే స్టేజి పై, అది ప్రతిష్టాత్మకమైన అవార్డ్ వరించడంతో అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు.
అలాగే హీరో వరుణ్ ధావన్.. క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ గా అవార్డుని అందుకున్నాడు. గత ఏడాది చివరిలో విడుదలైన ‘భేడియా’ సినిమాకి వరుణ్ ధావన్ అవార్డ్ అందుకున్నాడు. ఇక అనుపమ్ ఖేర్ కి – మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డ్, సాచిత్ తాండిన్ కి – బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డ్ వరించింది.
Yeahh ????..
But i think Ajay Devgan should have been given as the male protagonist award ..But Ranbir ko mil gaya ? me is happy ???
Couple goals ?#AliaBhatt #RanbirKapoor? pic.twitter.com/bQwozpIU24
— ?????? (@whitehorse809) February 20, 2023