Brahmaji – YS Jagan : వైఎస్ జగన్ పై బ్రహ్మాజీ సంచలన ట్వీట్.. తర్వాత ట్విట్టర్ హ్యాక్ అయిందంటూ..
తాజాగా బ్రహ్మజీ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి.

Brahmaji Sensational Tweets on YS Jagan After he says his Twitter Hacked
Brahmaji – YS Jagan : సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే నటుల్లో బ్రహ్మాజీ ఒకరు. అప్పుడప్పుడు సొసైటీలో ఉన్న సమస్యల మీద కూడా స్పందిస్తు వెటకారంగా ట్వీట్స్ వేస్తూ ఉంటాడు బ్రహ్మజీ. తాజాగా బ్రహ్మజీ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి. విజయవాడలో ఏర్పడిన వరదల కారణంగా అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మరీ రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తున్నారు.
అయితే వరదల విషయంలో ప్రతిపక్షం మాత్రం ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ చంద్రబాబుని ఉద్దేశించి విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశారు. దీనికి నటుడు బ్రహ్మాజీ నిన్న స్పందిస్తూ.. మీరు కరెక్ట్ సార్.. వాళ్ళు చెయ్య లేరు సార్.. ఇకనుంచి మనం చేద్దాం సర్.. ఫస్ట్ 1000 కోట్లు రిలీజ్ చేద్దాం సర్.. మన వైస్సార్సీపీ క్యాడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం.. మనకి జనాలు ముఖ్యం సార్.. గవర్నమెంట్ కాదు సార్. మనం చేసి చూపిద్దాం సార్.. జై జగన్ అన్న అంటూ వెటకారంగా ట్వీట్ చేసాడు.
దీంతో పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు బ్రహ్మాజీపై విరుచుకుపడ్డారు. అయితే ఇవాళ ఉదయం ఆ ట్వీట్ డిలీట్ చేసి.. నా X అకౌంట్ ఎవరో హ్యాక్ చేసి ట్వీట్ చేసారు. నాకు ఆ ట్వీట్ కి సంబంధం లేదు. కంప్లైంట్ చేసాం అని మరో ట్వీట్ చేసాడు బ్రహ్మజీ. అయినా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మరోసారి బ్రహ్మాజీని ట్రోల్ చేస్తుండగా జనసేన, టీడీపీ కార్యకర్తలు మాత్రం బ్రహ్మజీకి సపోర్ట్ గా ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి బ్రహ్మాజీ ఒక్క ట్వీట్ తో సోషల్ మీడియాలో నిన్నటి నుంచి పొలిటికల్ చర్చగా మారాడు.
Idhaa Context 😭🤣 pic.twitter.com/2QWdn7MCql
— తేజ నాయుడు™𓃵𝗝𝗦𝗣..🦅 (@TEJA_NAIDU1) September 8, 2024