Balagam Mogilayya : టాలీవుడ్ లో విషాదం.. ‘బలగం మొగిలయ్య’ కన్నుమూత..

తాజాగా నేడు ఉదయం మొగిలయ్య కన్నుమూశారు.

Balagam Mogilayya : టాలీవుడ్ లో విషాదం.. ‘బలగం మొగిలయ్య’ కన్నుమూత..

Burra Katha Artist Balagam Mogilayya Passed Away

Updated On : December 19, 2024 / 8:25 AM IST

Balagam Mogilayya : ఇటీవల వచ్చిన సూపర్ హిట్ సినిమా బలగం క్లైమాక్స్ లో తన బుర్రకథతో పాడిన పాటతో ప్రేక్షకులను మెప్పించాడు మొగిలయ్య. ఎన్నో ఏళ్లుగా మొగిలయ్య – తన భార్య కొమురమ్మ బుర్రకథలు చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. బలగం సినిమాతో వీరికి మంచి పేరు వచ్చింది. తాజాగా నేడు ఉదయం మొగిలయ్య కన్నుమూశారు.

Also Read : 2024 Celebrity Divorce : 2024లో విడిపోయిన సినీ సెలబ్రిటీలు వీళ్ళే..

గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్య వరంగల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. చికిత్సకు కూడా డబ్బులు లేకపోవడంతో గతంలో బలగం డైరెక్టర్ వేణు, గత ప్రభుత్వం వీరికి ఆర్ధిక సహాయం చేసారు. చికిత్స తీసుకుంటూనే మొగిలయ్య కన్నుమూశారు.

దీంతో పలువురు బుర్రకథ కళాకారులు, సినీ ప్రముఖులు బలగం మొగిలయ్యకు నివాళులు అర్పిస్తున్నారు.