Crazy Combination Films: పేరుకి క్రేజీ కాంబోలు.. కానీ మొదలయ్యేది ఎప్పుడో మిస్టరీ!
అప్పుడెప్పుడో ఈ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నామని హీరోలు.. ఈ హీరోలతో సినిమా కమిట్ అయ్యామని డైరెక్టర్లు.. అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇన్నాళ్లయినా.. ఇంకా సినిమాలు మాత్రం..

Crazy Combination Films
Crazy Combination Films: అప్పుడెప్పుడో ఈ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నామని హీరోలు.. ఈ హీరోలతో సినిమా కమిట్ అయ్యామని డైరెక్టర్లు.. అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇన్నాళ్లయినా.. ఇంకా సినిమాలు మాత్రం స్టార్ట్ అవ్వలేదు. ఇంతకీ ఈ క్రేజీ కాంబినేషన్స్ తెరకెక్కేదెప్పుడు..? ఈ సినిమాలు సెట్స్ మీదకెళ్లేప్పుడు..? అసలు ఈ సినిమాలు లైన్లో ఉన్నట్టా.. లేనట్టా..? అని సినీ ప్రేక్షకులు తెగ చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, హీరోలు వరసగా సినిమాలైతే అఫీషియల్ గానే అనౌన్స్ చేస్తున్నారు కానీ.. ఆ సినిమాల్లో కొన్నింటిని పక్కన పెట్టి.. మళ్లీ కొత్త సినిమాలతో బిజీఅయిపోతున్నారు. అయితే ఆడియన్స్ మాత్రం అసలు ఈ సినిమాలు ఉన్నాయా.. లేవా అంటూ డైలమాలోఉన్నారు.
Back Door Review: హద్దులు దాటమనే వయసు.. తప్పని చెప్పే మనసు.. ‘బ్యాక్ డోర్’
అల్లు అర్జున్ సినిమాల విషయంలో కూడా ఫాన్స్ ఇలాంటి కన్ ఫ్యూజన్ లోనే ఉన్నారు. బన్నీ ఇప్పటికే వేణుశ్రీరామ్ ఐకాన్ తో పాటు బోయపాటి శ్రీనుతో సినిమాలు కమిట్ అయ్యారు. కానీ ఈ సినిమాలు ఇప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లే ఛాన్స్ లేనట్టే. ఫిబ్రవరి నుంచి పుష్ప షూటింగ్ స్టార్ట్ అయినా.. ప్యార్లల్ గా వేరే సినిమా స్టార్ట్ చెయ్యడానికి వీలు లేదు. అందుకే ఈ సినిమాలు చేస్తాడా..? చెయ్యడా అని తెగ ఆలోచిస్తున్నారు ఫాన్స్. దాదాపు రెండేళ్ల నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చెయ్యాల్సిన సినిమా మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిగో.. అదిగో అంటూ లాంచింగ్ ని పోస్ట్ పోన్ చేస్తున్నారు టీమ్. ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తోనేకాదు.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాటు.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో కూడా సినిమాలు చెయ్యాల్సి ఉంది. అయితే వీటిలో ఏ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
Omicron Effect on Films: టెన్షన్.. టెన్షన్.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో?!
మొన్నటి వరకూ అసలు ట్రిపుల్ ఆర్, ఆచార్య తప్పవేరే సినిమాల జోలికెళ్లని రామ్ చరణ్ కూడా శంకర్, గౌతమ్ తిన్ననూరితో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేశారు. అయితే వీటి కంటే ముందే.. చరణ్ రంగస్తలంతో తన కెరీర్ కు మైలేజ్ ఇచ్చినసుకుమార్ తో మరో సినిమా చెయ్యాల్సి ఉంది. అయితే అసలు ఈ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా..? వీళ్లిద్దరి సినిమా సెట్స్ మీదకెళుతుందా అని ఆలోచిస్తున్నారు ఫాన్స్. మరో స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా లైగర్ సినిమాకి ప్యార్లల్ గా సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. ఫాల్కన్ ప్రొడక్షన్స్ లో సుకుమార్ తో సినిమా, అర్జున్ రెడ్డి లాంటి కెరీర్ హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డితో పాటు ఇంటెన్స్ ఎమోషన్స్ తో సినిమాలు చేసే శివనిర్వాణతో సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. కానీ వాటిలో ఇప్పటి వరకూ ఏదీ మెటీరియలైజ్ అవ్వలేదు. అసలు ఈ మూడు సినిమాల్లో ఏది ఫస్ట్ స్టార్టవుతుందో కూడా క్లారిటీ ఇవ్వలేదు విజయ్.
Ashu Reddy Oo Antava Song: ఊ అంటావా మావా.. ఇరగదీసిన అషు!
రోజురోజుకీ ఈక్వేషన్లు మారిపోతున్నాయి సినిమా ఇండస్ట్రీలో. ముందు కమిట్ అయిన సినిమాలు కాకుండా ఎవరూ లైమ్ లైట్లో ఉంటే వాళ్లతో సినిమాలు చేసేస్తున్నారు అందరూ. అందుకే అటు హీరోలు, డైరెక్టర్లు సినిమాలు అనౌన్స్ చేసినా అవి సెట్స్ మీదకెళ్లేవరకూ గ్యారంటీ లేదనుకుంటున్నారు జనాలు. టాలీవుడ్ లో ప్రజెంట్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాద్ కూడా ప్రజెంట్ విజయ్ దేవరకొండతో చేస్తున్న లైగర్ సినిమా తర్వాత నెక్టస్ ఎవరితో సినిమా చేస్తాడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే పూరీజగన్నాధ్ తో పైసా వసూల్ లాంటి క్రేజీ మూవీ చేసిన బాలయ్య మరోసారి ఈ కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నట్టు చెప్పారు.
Release Postpone: సర్వం సిద్ధం.. కానీ.. తప్పని రిలీజ్ డేట్స్ రీ షెడ్యూల్
లేటెస్ట్ గా తెలుగులో తన ఫస్ట్ సినిమా టైటిల్ ని రివీల్ చేశారు తమిళ్ స్టార్ హీరో ధనుష్. తెలుగులో తనకున్న క్రేజ్ ని స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసి మరింత పెంచుకోవాలనుకున్న ధనుష్.. తెలుగులో ఫస్ట్ సినిమా అనౌన్స్ చేసింది మాత్రం శేఖర్ కమ్ములతో. కానీ.. లేటెస్ట్ గా వెంకీ అట్లూరితో సార్ అనే తమిళ్, తెలుగు బైలింగ్వల్ మూవీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరి శేఖర్ కమ్ములతో సినిమా ఉన్నాట్టా లేనట్టా అన్న ఆలోచనలో పడ్డారు ఆడియన్స్. జానర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న సీనియర్ హీరో వెంకటేష్.. కూడా అప్పుడెప్పుడో.. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో పాటు.. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో సినిమాలు ప్లాన్ చేశారు. కానీ ఈ సినిమాలు కమిట్ అయ్యాక.. దృశ్యం, నారప్ప సినిమాలు రిలీజ్ చేసి రిలాక్స్ అయ్యారు కానీ.. ఈ ఇద్దరు డైరెక్టర్లతో సినిమాలు ఎప్పుడన్నది మాత్రం క్లారిటీ లేదు.