RRR Postpone: టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం.. వుయ్ వాంట్ అఫీషియల్ కన్ఫర్మేషన్
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మళ్ళీ వాయిదా పడిందా అంటే అవుననే అంటున్నారు సినిమా వర్గాలు.

Rrr
RRR Postpone: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మళ్ళీ వాయిదా పడిందా అంటే అవుననే అంటున్నారు సినిమా వర్గాలు. జనవరి 7న రావాల్సిన ఈ సినిమా పలు రాష్ట్రాలలో కరోనా ప్రభావంతో ఆంక్షల నేపథ్యంలో మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తుంది. అందుకే రాజమౌళి అండ్ కో ప్రమోషన్ కార్యక్రమాలను ఆపేసినట్లు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా పోస్ట్ పోన్ అనే హ్యాష్ టాగ్ కూడా ట్రెండింగ్ అయింది.
Liger: సోషల్ మీడియాను షేక్ చేసిన లైగర్.. అల్ ఇండియా రికార్డ్!
గత కొద్దిరోజులుగా వరుస అప్డేట్లను ఇస్తూ జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మరోసారి వాయిదా తప్పదని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నా మేకర్స్ మాత్రం ఈ విషయంలో ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వచ్చారు. కానీ ఈసారి ఇంత జరుగుతున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతో దాదాపుగా వాయిదా ఖరారైనట్లుగా కనిపిస్తుంది. అయితే.. మేకర్స్ నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో ఎక్కువగా అధికారిక క్లారిటీ మీదనే ఎక్కువ ట్వీట్స్, పోస్ట్స్ ఉంటున్నాయి.
RRR: తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు.. ఎక్కడ.. అసలు ఉంటుందా?
ఆర్‌ఆర్‌ఆర్ వాయిదాతో తీవ్ర నిరాశకు గురైన నెటిజన్లు రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నామని, వెంటనే అధికారిక ప్రకటన చేయాలని కొందరు డిమాండ్ చేస్తుంటే.. మరికొందరు ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయ్యేలోపు ముసలోడిని అయిపోతానేమో అంటూ కొందరు.. ఆర్ఆర్ఆర్ వచ్చేలోపు చిరంజీవి 200వ సినిమా విడుదల అవుతుందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే సమ్మర్ లో మరో వేరియంట్ వస్తే మళ్ళీ వాయిదా వేస్తావా జక్కన్నా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మరోసారి వాయిదా అనే నిరాశ మాత్రం ప్రేక్షకులలో స్పష్టంగా కనిపిస్తుంది.
#RRRMovie Postpone Undo ledo Fast ga Cheppandi E Tension Tattukolemu 😭😭😭 Pls @RRRMovie We Want Official Confirmation pic.twitter.com/l59mGt8xbH
— Dr RCcult🔥 (@AlwayzDurgesh) January 1, 2022
https://twitter.com/misterjay69/status/1477172647456739329?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1477172647456739329%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fnetizens-shares-funny-memes-rrr-movie-release-postpone-1424158
https://twitter.com/misterjay69/status/1477173111015411715?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1477173111015411715%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fnetizens-shares-funny-memes-rrr-movie-release-postpone-1424158
The decision by Danayya garu and Rajamouli garu to defer the release date of #RRRMovie is well appreciated. Wishing the #valimai team all the best
— #leo (@San208939224) January 1, 2022