Captain America Chris Evans: పీపుల్ మ్యాగజైన్ “సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్‌గా” కెప్టెన్ అమెరికా..
మర్వెల్ సినిమాస్ తో 'కెప్టెన్ అమెరికా'గా భారతీయ సినీ ప్రేక్షకులకు పరిచయమైన హాలీవుడ్ నటుడు "క్రిస్ ఎవాన్స్". మర్వెల్ సిరీస్ లో మొదటి అవెంజర్ గా ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్న ఈ 41 ఏళ్ళ నటుడు ఇంకా సింగల్ గానే ఉన్నాడు. తాజాగా ఈ హీరో 2022 సంవత్సరానికి గాను పీపుల్ మ్యాగజైన్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్‌గా ఎంపికయ్యాడు.

Captain America Chris Evans as People Magazine's Sexiest Man Alive
Captain America Chris Evans: మర్వెల్ సినిమాస్ తో ‘కెప్టెన్ అమెరికా’గా భారతీయ సినీ ప్రేక్షకులకు పరిచయమైన హాలీవుడ్ నటుడు “క్రిస్ ఎవాన్స్”. మర్వెల్ సిరీస్ లో మొదటి అవెంజర్ గా ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్న ఈ 41 ఏళ్ళ నటుడు ఇంకా సింగల్ గానే ఉన్నాడు. తాజాగా ఈ హీరో 2022 సంవత్సరానికి గాను పీపుల్ మ్యాగజైన్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్‌గా ఎంపికయ్యాడు.
Avatar 2: అవతార్ 2 హిట్ అయితేనే.. లేకపోతే మర్చిపోండి అంటోన్న జేమ్స్ కామెరాన్!
దీనికి క్రిస్ స్పందిస్తూ.. “పీపుల్ మ్యాగజైన్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. మా అమ్మ కూడా చాలా సంతోష పడుతుంది. నేను చేసే ప్రతి పనికి ఆమె గర్వపడుతుంది కానీ తన కొడుకు వరల్డ్ సెక్సీయెస్ట్ మ్యాన్ అని చెప్పుకోడానికి, ఆమె కొంచెం ఇబ్బంది పడవచ్చు” అంటూ హాస్యాస్పదంగా వ్యాఖ్యానించాడు. అలాగే తన స్నేహితులు కూడా ఈ టైటిల్ తో తనని ఆటపట్టించవచ్చు అని చెప్పుకొచ్చాడు.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఇంతటి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు, నటనకు కొంత గ్యాప్ ఇచ్చి.. వివాహం చేసుకోవాలని, తండ్రి కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. కాగా క్రిస్ చివరగా రస్సో బ్రదర్స్ తెరకెక్కించిన ‘ది గ్రే మ్యాన్’ మూవీలో సోషియోపతిక్ మాజీ-CIA ఏజెంట్ గా కనిపించాడు. ఈ సినిమాలోనే తమిళ్ స్టార్ హీరో ధనుష్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో మెరిశాడు.