Captain Vijayakanth : మరణానంతరం పద్మ భూషణ్ అవార్డుకి ఎంపికైన కెప్టెన్ విజయ్ కాంత్..

ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో, రాజకీయ నేత, దివంగత కెప్టెన్ విజయ్ కాంత్ కి పద్మ భూషణ్ అవార్డుని ప్రకటించింది కేంద్రప్రభుత్వం.

Captain Vijayakanth : మరణానంతరం పద్మ భూషణ్ అవార్డుకి ఎంపికైన కెప్టెన్ విజయ్ కాంత్..

Captain Vijayakanth Awarded Padma Bhushan Posthumously

Updated On : January 26, 2024 / 3:07 PM IST

Captain Vijayakanth : రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న సాయంత్రం పద్మ అవార్డులని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఈ సందర్భంగా వీరందరికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో, రాజకీయ నేత, దివంగత కెప్టెన్ విజయ్ కాంత్ కి పద్మ భూషణ్ అవార్డుని ప్రకటించింది కేంద్రప్రభుత్వం. ఎన్నో సినిమాలతో స్టార్ హీరోగా నిలిచిన విజయ్ కాంత్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చి పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేశారు. గత ఏడాది డిసెంబర్ 28న ఆరోగ్య సమస్యలతో విజయ్ కాంత్ మరణించారు. ఇప్పుడు మరణానంతరం ఆయనకు పద్మభూషణ్ ప్రకటించడంపై కుటుంబ సభ్యులు, తమిళ ప్రముఖులు, ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Pawan Kalyan : పద్మ అవార్డులు అనగానే రికమెండ్ చేస్తారు.. కానీ మోదీగారు.. పవన్ సంచలన వ్యాఖ్యలు..

దీనిపై విజయ్ కాంత్ భార్య ప్రేమలత విజయ్ కాంత్ కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవార్డుని విజయ్ కాంత్ ని ప్రేమించే ప్రతి ఒక్కరికి అంకితం అని తెలిపారు.