Ranveer Singh : న్యూడ్ ఫోటోషూట్ చేసినందుకు రణవీర్ పై పోలీసు కేసు..

తాజాగా రణవీర్ న్యూడ్ ఫొటోషూట్ పై ముంబైకి చెందిన ఓ ఎన్జీఓ చెంబూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. మహిళల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. అలాగే రణవీర్ న్యూడ్ ఫోటోలపై..........

Ranveer Singh : న్యూడ్ ఫోటోషూట్ చేసినందుకు రణవీర్ పై పోలీసు కేసు..

Ranveer Singh

Updated On : July 26, 2022 / 6:30 AM IST

Ranveer Singh :  బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ రకరకాల బట్టలు, కొత్త రకం డిజైన్స్ తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. బాలీవుడ్ లో రణవీర్ సింగ్ డ్రెస్సులు, వేషధారణ, ఫొటోషూట్స్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి, అలాగే ట్రోల్స్ కూడా వస్తుంటాయి. అప్పుడప్పుడు ఆడవాళ్ళ బట్టలు, సగం సగం బట్టలు వేసుకొని ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు రణవీర్. ఇటీవల మరోసారి రణవీర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఈ సారి ఏకంగా న్యూడ్ ఫొటోషూట్ ఇచ్చి అందర్నీ షాక్ కి గురిచేశారు. ఓ మ్యాగజైన్ కోసం రణవీర్ న్యూడ్ ఫొటోషూట్ చేశాడు. అలాగే కేవలం కట్ డ్రాయర్ మీద కూడా ఫొటోలకి ఫోజులిచ్చాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక సోషల్ మీడియాలో ఈ ఫోటోల మీద భారీగా ట్రోలింగ్ జరుగుతుంది.

Dhanush Movie: ఆ రోజే ‘సార్’ టీజర్ రిలీజ్.. ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్

తాజాగా రణవీర్ న్యూడ్ ఫొటోషూట్ పై ముంబైకి చెందిన ఓ ఎన్జీఓ చెంబూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. మహిళల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. అలాగే రణవీర్ న్యూడ్ ఫోటోలపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీఎంసీ ఎంపీ, బెంగాలీ నటి మిమీ చక్రవర్తి ఈ విషయంపై సీరియస్ అయి ఒక మహిళ ఇలాగే ఫోటోషూట్‌ చేస్తే ప్రశంసిస్తారా అని ప్రశ్నించింది.