Happy Brthday Pabhas: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం..

  • Published By: sekhar ,Published On : October 23, 2020 / 02:30 PM IST
Happy Brthday Pabhas: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం..

Updated On : October 23, 2020 / 2:38 PM IST

Happy Birthday Prabhas: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం.. అందరితోనూ కలిసిపోయే గుణం.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సొంతం. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ షూటింగ్ కోసం ఇటలీలో ఉన్న ప్రభాస్ అక్కడే తన 41వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా డార్లింగ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

As a proud father, నువ్వు ఈ రోజు ఒక వ్యక్తిగా ఈ స్థాయికి ఎదగడం చూడడం కంటే నాకు ఎక్కువ ఆనందం ఏమీ లేదు. నువ్వు
సరిహద్దులు మరియు రికార్డులను బద్దలు కొట్టబోయే చాలా సంవత్సరాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇలా చెబుతున్నప్పుడు నేను గర్వంతో నిండి ఉన్నాను. నీకు ఎల్లప్పుడూ నా ఆశీర్వాదాలు ఉంటాయి-రెబల్ స్టార్ కృష్ణంరాజు

 

హ్యాపీ బర్త్‌డే మై ఫేవరెట్.. ఎల్లప్పుడు వినయపూర్వకంగా ఉండి రాబోయే రోజుల్లో మరింత ఎత్తుకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఎల్లప్పుడూ నీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నాను.. అన్నయ్య, లవ్యూ..-ప్రసీద ఉప్పలపాటి

నాకు తమ్ముడు లాంటి సూర్య నారాయణరాజు కొడుకు, మా ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు… రాబోయే చిత్రాలతో ఇంకెంతో కీర్తి సాధించాలని ఆశీర్వదిస్తున్నాను..-దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు

వెరీ హ్యాపీ బర్త్‌డే మై డియర్ ప్రభాస్.. ఎగ్జైటింగ్ సినిమా లైనప్స్ తో ఈ సంవత్సరం మరింత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను- మెగాస్టార్ చిరంజీవి

Image
హ్యాపీ బర్త్‌డే ప్రభాస్.. అనంతమైన విజయాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను-సూపర్ స్టార్ మహేష్ బాబు

Image
హ్యాపీ బర్త్‌డే డియర్ ప్రభాస్.. Sending you lots of love and happiness!-విక్టరీ వెంకటేష్

ప్రభాస్ అన్నకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరమంతా నీకు గొప్పగా ఉండాలి – వరుణ్ తేజ్

హ్యాపీ బర్త్‌డే బ్రదర్.. చేయబోయే ప్రతి పనిలోనూ నీకు మంచే జరగాలి-రానా
హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అన్నా.. ప్రేమ, సంతోషం, సక్సెస్ నీ వెంటే ఉండాలని కోరుకుంటున్నా-సాయితేజ్

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మంచి మనిషి డార్లింగ్ ప్రభాస్‌కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీ భవిష్యత్తు ప్రాజెక్టులన్నింటికీ ఆల్ ది బెస్ట్ – నితిన్

హ్యాపీ బర్త్ డే ప్రభాస్. ఈ సంవత్సరమంతా నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. మీ స్టార్‌డమ్ మరింత పెరగాలి-రకుల్

సూపర్ కూల్ డార్లింగ్ ప్రభాస్‌కు హ్యాపీ బర్త్ డే. రాధేశ్యామ్ కోసం ఎదురుచూస్తున్నా. ఎప్పటిలాగానే ఆ సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నా-డైరెక్టర్ బాబి

భారతీయ బాక్సాఫీస్‌ను అతను జయించాడు. ఇప్పుడు అతని ముందు ప్రపంచ బాక్సాఫీస్ ఉంది. రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్.. ఇలా ఏ పేర్లతో పిలిచినా ఆయన మాత్రం మనందరి హృదయాల్లో ఎప్పటికీ డార్లింగ్. ప్రభాస్‌కి అంతా మంచే జరగాలి -మారుతి

కార్తికేయ, గుణశేఖర్, జగపతిబాబు, శ్రీకాంత్, సునీల్, సంపత్ నంది తదితరులు ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు.