Chandini Chowdary : నేను, బాలయ్య గారు కలిసి షూట్‌లో ప్రాంక్స్ చేశాం.. NBK 109 అప్డేట్ ఇచ్చిన చాందిని చౌదరి..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాందిని చౌదరి NBK109 సినిమా గురించి, బాలకృష్ణ గురించి మాట్లాడుతూ..

Chandini Chowdary : నేను, బాలయ్య గారు కలిసి షూట్‌లో ప్రాంక్స్ చేశాం.. NBK 109 అప్డేట్ ఇచ్చిన చాందిని చౌదరి..

Chandini Chowdary Interesting Comments on Balakrishna and NBK 109 Movie

Updated On : June 11, 2024 / 11:11 AM IST

Chandini Chowdary : చాందిని చౌదరి వరుసగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో లీడ్ రోల్స్ లో దూసుకుపోతుంది. త్వరలో బాలకృష్ణ సినిమాలో కూడా కనిపించబోతుంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ NBK109 సినిమాలో చాందిని చౌదరి ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిన్న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా షూటింగ్ టైంలో బాలయ్యతో దిగిన స్పెషల్ ఫోటో కూడా షేర్ చేసి బాలకృష్ణకు విషెష్ తెలిపింది చాందిని.

Also Read : Prabhas – Kalki : అసలు ప్రభాస్ ‘కల్కి’ కాదా? మరి కల్కి ఎవరు? ప్రభాస్ పాత్ర ఏంటి? ఇదెక్కడి ట్విస్ట్ బ్రో..

అలాగే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాందిని చౌదరి NBK109 సినిమా గురించి, బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. సినిమా ఆల్మోస్ట్ 50 శాతం షూటింగ్ అయిపోయింది. ఇందులో నేను ఒక స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ ఉంటుంది నా పాత్ర. స్టార్ హీరో సినిమాలో చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాను. కథలో నాది చాలా ఇంపార్టెంట్ ఉన్న పాత్ర. సెట్ లో బాలయ్య చాలా సరదాగా ఉంటారు. సెట్ లో మేమేమిద్దరం కలిసి అందరి మీద ప్రాంక్స్ చేసేవాళ్ళం సరదాగా. షాట్ ఉన్నా లేకపోయినా బాలయ్య గారు సెట్ లోనే ఉంటారు. చిన్న పిల్లల దగ్గర్నుంచి అందరితో ఈజీగా కలిసిపోతారు ఆయన అని తెలిపింది.