Prabhas – Kalki : అసలు ప్రభాస్ ‘కల్కి’ కాదా? మరి కల్కి ఎవరు? ప్రభాస్ పాత్ర ఏంటి? ఇదెక్కడి ట్విస్ట్ బ్రో..

ట్రైలర్ చూసిన తర్వాత అసలు కల్కి ప్రభాస్ కాదు అనే అంటున్నారు.

Prabhas – Kalki : అసలు ప్రభాస్ ‘కల్కి’ కాదా? మరి కల్కి ఎవరు? ప్రభాస్ పాత్ర ఏంటి? ఇదెక్కడి ట్విస్ట్ బ్రో..

Prabhas is not Kalki After watching Kalki Movie Trailer Netizens stories goes Viral

Updated On : June 11, 2024 / 10:37 AM IST

Prabhas – Kalki : ప్రభాస్ కల్కి సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. నిన్న కల్కి సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా కల్కి ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెరిగాయి. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న కల్కి ట్రైలర్ ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే కల్కి సినిమా మొదలుపెట్టినప్పట్నుంచి ఈ సినిమా గురించి రకరకాల కథలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కథ కలియుగం చివర్లో జరుగుతుందని, విష్ణు పదవ అవతారం కల్కి వచ్చి భూమి మీద ఉన్న మనుషులను కాపాడతాడని అనుకుంటున్నారు. ఆ కల్కి ప్రభాస్ అని ఇప్పటివరకు అంతా భావించారు. అయితే ట్రైలర్ చూసిన తర్వాత అసలు కల్కి ప్రభాస్ కాదు అనే అంటున్నారు. తాజాగా కల్కి ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ట్రైలర్ చూసి చాలా మంది మరో కొత్త కథ అనుకుంటున్నారు.

Also Read : Deepika Padukone : కల్కి ట్రైలర్ ఓకే.. కానీ దీపికా పదుకోన్ డబ్బింగ్ పై విమర్శలు..

ట్రైలర్ లో దీపికా పదుకోన్ గర్భవతిగా కనిపిస్తుంది. అమితాబ్ మహాభారతంలోని అశ్వత్థామ అని ఇప్పటికే చెప్పేసారు. చిరంజీవిగా కలియుగం చివరివరకు ఉంటాడు. అమితాబ్ ట్రైలర్ లో నేను రక్షించాల్సింది ఒక్కడినే అని చెప్తాడు. అలాగే దీపికాతో.. నువ్విప్పుడు కనబోయేది మాములు ప్రాణం కాదమ్మా, సృష్టిని, నేను కాపాడతాను అని చెప్తాడు. అయితే ఓ షాట్ లో దీపికా – ప్రభాస్ కలిసినట్టు చూపిస్తారు. అలాగే ప్రభాస్ – అమితాబ్ పాత్రలకు ఫైట్ జరిగినట్టు కూడా చూపించారు. దీంతో ప్రభాస్ కల్కి కాదని, దీపికాకు పుట్టబోయే బిడ్డ కల్కి అని అనుకుంటున్నారు. సినిమా చివర్లో దీపికా కల్కికి జన్మనివ్వడంతో ముగించి పార్ట్ 2 కి లీడ్ ఇస్తారని కూడా కొంతమంది భావిస్తున్నారు.

అసలు కథేంటో నాగ్ అశ్విన్ చెప్పకపోయినా కల్కి సినిమాపై రకరకాల కథలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త కథ వినిపిస్తుంది. ట్రైలర్ చూసిన వాళ్లంతా కూడా ప్రభాస్ కల్కి కాదనే అంటున్నారు. మరి ప్రభాస్ పాత్ర ఏంటి? కల్కి ఎవరు? కొత్తగా నాగ్ అశ్విన్ ఏం ట్విస్ట్ ప్లాన్ చేసాడో అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ సినిమా టైటిల్ కల్కి ప్రభాస్ కాకపోతే అభిమానులు ఊరుకుంటారా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అసలు కథ తెలియాలంటే జూన్ 27 వరకు సినిమా వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే.