Chandini Chowdary : ‘గామి’ కోసం లైఫ్ రిస్కులు చేసిన చాందిని చౌదరి.. ఏ హీరోయిన్ ఇలా చేసేవాళ్ళే కాదేమో..

గామి సినిమాలో ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రాణం పెట్టి నటించారు.

Chandini Chowdary : ‘గామి’ కోసం లైఫ్ రిస్కులు చేసిన చాందిని చౌదరి.. ఏ హీరోయిన్ ఇలా చేసేవాళ్ళే కాదేమో..

Chandini Chowdary Life Risk for Gaami Movie Extraordinary Character by Chandini

Chandini Chowdary : విశ్వక్ సేన్(Vishwak Sen), చాందిని చౌదరి(Chandini Chowdary) మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘గామి’. ఓ ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా నిన్న మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 8న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొదటిరోజే ఈ సినిమా 9 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో కనిపించగా చాందిని చౌదరి, అభినయ, చైల్డ్ ఆర్టిస్ట్ ఉమా, మహమ్మద్ సమద్.. ముఖ్య పాత్రల్లో నటించారు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ క్రౌడ్ ఫండింగ్ తో ఆరేళ్లపాటు కష్టపడి ఈ సినిమాని నిర్మించగా యూవీ క్రియేషన్స్ గామి సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేసింది.

ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రాణం పెట్టి నటించారు. లైఫ్ రిస్క్ చేసి మరీ కొన్ని సీన్స్ చేశారు. ఈ సినిమాలో చాలా సీన్స్ హిమాలయాల్లో ఉంటాయి. ఈ సీన్స్ లో కొన్ని నిజంగానే హిమాలయాల్లో షూటింగ్ చేయగా, ఇంకొన్ని సెట్స్ వేసి తెరకెక్కించారు. ఈ సీన్స్ లో విశ్వక్, చాందిని చాలా రిస్క్ చేశారు. ఆ సీన్స్ అన్ని వెండితెరపై అదిరిపోయాయి.

#గామి సినిమా కోసం చాందిని చౌదరి ఆరేళ్ళు కష్టపడింది. ఒక ఎదుగుతున్న హీరోయిన్ ఒక సినిమా కోసం ఆరేళ్ళు టైం ఇవ్వడం అంటే మాటలు కాదు. కానీ క్యారెక్టర్, సినిమా నచ్చి చాందిని ఇంత సమయం సినిమాకి ఇచ్చింది.

#ఈ మధ్యలో వేరే ఛాన్సులు వస్తే చేసుకుంటూ ఇందులో లుక్స్ పరంగా ఎలాంటి తేడాలు రాకుండా ఇన్నేళ్లు మెయింటైన్ చేయడం కూడా కష్టమే.

#హిమాలయాల్లో నీళ్లు గడ్డకట్టిన ప్రాంతంలో షూట్ చేస్తుంటే ఐస్ పగిలి ఆ నీళ్ళల్లో పడే పరిస్థితులు వచ్చినా జస్ట్ తృటిలో తప్పించుకుంది చాందిని.

#ఇక హిమాలయాల్లోని నీళ్లలో పడిన సీన్ గ్రాఫిక్స్ లో తీసినా, ఆ సీన్స్ షూట్ చేసేంత సేపు గాల్లో రోప్స్ సహాయంతో వేలాడింది.

#హిమాలయాల్లో కొండల మీద నుంచి దూకిన సీన్స్ కూడా సెట్స్ లో చేసినా వాటికి కూడా రిస్క్ చేసి పై నుంచి దూకింది. హీరోలు చేసే అన్ని సీన్స్, ఇందులో విశ్వక్ తో సమానంగా చాందిని ఏ మాత్రం తక్కువ కాదంటూ చేసింది.

#హిమాలయాల్లో షూటింగ్ సమయంలో వాష్ రూమ్స్ లేకపోవడంతో, సెట్ లో ఒక్క అమ్మాయి అయినా, రోజంతా షూటింగ్ టైంలో నీళ్లు తాగకుండా ఎంత కష్టమైనా భరించి గామి షూటింగ్ లో పాల్గొంది చాందిని.

#సెట్స్ లో చేసిన షాట్స్ ఉప్పులో తీసినవి. దాదాపు 5000 కేజీల ఉప్పు వేసి హిమాలయాల సెట్ తయారుచేసారు. రోజంతా అలా ఉప్పులో కూర్చొని చేయడం కూడా రిస్క్ తో కూడినదే. ఆ ఉప్పు వల్ల తన స్కిన్ కేర్ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వచ్చింది.

#గామి సినిమాలో హిమాలయాల్లో ఉన్న ప్రతి సీన్ కష్టంతో కూడుకున్నదే. అది నిజంగా హిమాలయాల్లో చేసినా, షూటింగ్ సెట్ లో చేసినా ఆ కష్టాలు చాందిని భరించింది.

Also Read : Gaami : ‘గామి’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? అదరగొట్టిన విశ్వక్..

ఇన్ని సంవత్సరాల సమయం, లైఫ్ రిస్క్ పెట్టి సీన్స్ చేయడం, ఎంత కష్టమైనా భరించి షూటింగ్ చేయడం చాందిని చౌదరికే దక్కింది. ఇప్పుడున్న వేరే ఏ కమర్షియల్ హీరోయిన్స్ ఈ సినిమా చేయమంటే కచ్చితంగా చేసేవారు కాదు. అందులోను చాందిని చౌదరి తెలుగమ్మాయి కావడం విశేషం. మన తెలుగమ్మాయి ఇన్ని కష్టాలు పడి ఇంత మంచి సినిమా తీసినందుకు కచ్చితంగా అభినందించాల్సిందే. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు వస్తే కచ్చితంగా చేస్తాను అని గామి ప్రమోషన్స్ లో తెలిపింది చాందిని చౌదరి.