డిగ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన నటి హేమ..

  • Published By: sekhar ,Published On : September 27, 2020 / 04:24 PM IST
డిగ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన నటి హేమ..

Updated On : September 27, 2020 / 5:01 PM IST

Hema Wrote open Degree Entrance Exam: సీనియర్ నటి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ డిగ్రీ పరీక్ష రాశారు. అవును.. మీరు చదివింది నిజమే.. డిగ్రీ పట్టా పొందేందుకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్న హేమ.. అర్హత పరీక్షను (ఎంట్రన్స్ ఎగ్జామ్) ఆదివారం నల్లగొండ జిల్లాలోని ఎన్జీ కళాశాలలో రాశారు.


పరీక్ష అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఎప్పటినుంచో డిగ్రీ చేయాలని ఉంది, హైదరాబాద్ అయితే ఇబ్బంది ఉంటుందని నల్లగొండలో పరీక్ష రాయాల్సి వచ్చింది. ఎవరి కంటా పడకూడదనే ఇక్కడ పరీక్ష రాసేందుకు వచ్చాను’ అన్నారు.


ప్రస్తుతం తాను రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌లో పాల్గొంటున్నానని, నల్గొండ అయితే ఫిల్మ్ సిటీకి దగ్గరగా ఉండటం, హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు, ట్రాఫిక్ ఇబ్బందులు వంటివి ఉండటంతో ఇక్కడ పరీక్ష రాసినట్టు చెప్పారు. అంతేగాక ఎవరైనా గుర్తు పడితే… ప్రశాంతంగా పరీక్ష రాయడం కష్టమవుతుందనే ఆలోచన కూడా ఇక్కడ పరీక్ష రాయడానికి ఓ కారణమన్నారు హేమ.