Artist Pragathi : 25 ఏళ్ళ వయసులో నటి ప్రగతి ఎలా ఉందో చూశారా?
ప్రస్తుతం సినిమాల కంటే కూడా పవర్ లిఫ్టింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు ఉంది ప్రగతి.

Character Artist Pragathi Shares her 25 Years age Photo goes Viral
Artist Pragathi : క్యారెక్టర్ ఆర్టిస్ట్, నటి ప్రగతి ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో నటిస్తుంది. తెలుగు, తమిళ్ లో దాదాపు 150కి పైగా సినిమాల్లో అమ్మ, అత్త.. లాంటి పలు పాత్రలతో మెప్పించింది. తెలుగు ప్రేక్షకులకు ప్రగతి చాలా దగ్గరైంది. ఇటీవల అడపాదడపా సినిమాలు చేస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన వర్కౌట్ వీడియోలు పోస్ట్ చేస్తుంది ప్రగతి. ఆల్మోస్ట్ రోజుకి 8 గంటలు జిమ్ లోనే వర్కౌట్స్ చేస్తుంది. ఇటీవల కొన్నాళ్ల క్రితం జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ లో ప్రగతి పాల్గొని రజత పతకం కూడా సాధించింది.
Also Read : Prashanth Reddy : కాలేజీ మానేసి రోజూ షూటింగ్‌కి వెళ్లిన డైరెక్టర్.. రాజమౌళి ఏమన్నాడంటే..
ప్రస్తుతం సినిమాల కంటే కూడా పవర్ లిఫ్టింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు ఉంది ప్రగతి. గతంలో చాలా సార్లు జిమ్ లో ప్రగతి వర్కౌట్ వీడియోలు, ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా నటి ప్రగతి సోషల్ మీడియాలో తన 25 ఏళ్ళ అప్పటి ఫోటో షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తను 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉన్నానో చూడండి అంటూ ఓ ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటో చుసిన వాళ్ళు హేమ చాలా మారిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రగతికి 48 ఏళ్ళు. చిన్న ఏజ్ లోనే పెళ్లిచేసుకున్న ప్రగతి ఆ తర్వాత భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి జీవిస్తుంది. 25 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు దిగిన తన ఫోటో ప్రగతి ఇప్పుడు షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.