రానా ఎవరు? నేనే రానా : జెర్సీ పిల్లోడి పంచ్ లకు నవ్వాల్సిందే
యాంకర్ సుమ తనతో ఆడుకోవాలని చూస్తే, రివర్స్‌లో ఆమెనే ఆడుకుని కడుపుబ్బా నవ్వించాడు రోనిత్..

యాంకర్ సుమ తనతో ఆడుకోవాలని చూస్తే, రివర్స్‌లో ఆమెనే ఆడుకుని కడుపుబ్బా నవ్వించాడు రోనిత్..
నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాధ్ జంటగా, మళ్ళీ రావా ఫేమ్.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ, విజయవంతంగా రెండవ వారం ప్రదర్శింపబడుతుంది. ఈ సందర్భంగా థ్యాంక్యూ మీట్ నిర్వహించింది మూవీ యూనిట్. ‘జెర్సీ మా టీమ్ అందరికీ స్పెషల్ మూవీ, అందరూ పాతబడిపోవచ్చు కానీ, జెర్సీ సినిమా ఎప్పటికీ పాతబడదు’ అని నాని చెప్పాడు. రానా ఈ ఫంక్షన్‌కి గెస్ట్‌గా వచ్చాడు. ‘క్రికెట్, పెళ్ళి, అమ్మాయిలు, పిల్లలు వంటివి అర్థం కాని నాకే జెర్సీ చూస్తే ఏడుపొచ్చింది, సినిమా అనేది శాశ్వతం, అందులో జెర్సీ సినిమాకి తప్పకుండా ఒక పేజీ ఉంటుంది’ అని రానా అన్నాడు.
మూవీ టీమ్ అందరూ మాట్లాడటం ఒక ఎత్తైతే, నాని కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రోనిత్ మాట్లాడడం ఒక ఎత్తని చెప్పాలి. అతని ముద్దు ముద్దు మాటలకి అందరూ నవ్వుకున్నారు. యాంకర్ సుమ తనతో ఆడుకోవాలని చూస్తే, రివర్స్‌లో ఆమెనే ఆడుకుని కడుపుబ్బా నవ్వించాడు రోనిత్. నేను యాంకర్‌ని, నా పేరు సుమ అని సుమ తనని తాను పరిచయం చేసుకుంది. రోనిత్ చేత జెర్సీలో డైలాగ్స్ చెప్పించింది.
చివరిగా రానా తెలుసా అనడిగితే, రానా ఎవరు అనగానే అందరూ నవ్వారు. రానా.. నేనే అంటూ చెయ్యి ఊపాడు. సుమ, బాహుబలి చూసావా? అనడిగితే.. చూడలేదని చెప్పాడు. ప్రభాస్, రానా, అనుష్క కంటే కూడా కట్టప్ప సత్యరాజ్‌ని మాత్రం బాగానే గుర్తు పెట్టుకున్నాడు. ఎందుకంటే జెర్సీలో ఆయన కోచ్ క్యారెక్టర్ చేసాడు కాబట్టి.. రోనిత్ ఏం మాట్లాడాడో చూడండి..
వాచ్ వీడియో..