హృదయాల్ని హత్తుకుంటున్న ‘చిన్నతనమే చేర రమ్మంటే’ సాంగ్
ప్రతిరోజూ పండగే - ‘చిన్నతనమే చేర రమ్మంటే’ లిరికల్ సాంగ్ రిలీజ్..

ప్రతిరోజూ పండగే – ‘చిన్నతనమే చేర రమ్మంటే’ లిరికల్ సాంగ్ రిలీజ్..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా.. ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించాయి.
ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. గురువారం సాయంత్రం మరో సాంగ్ రిలీజ్ చేశారు. థమన్ ట్యూన్‌కి సిరివెన్నెల అద్భుతమైన పదాలు రాయగా విజయ్ ఏసుదాస్ అంతే అద్భుతంగా పాడారు.
‘‘చిన్నతనమే చేర రమ్మంటే.. ప్రాణం నిన్న వైపే దారి తీస్తోందే.. అడుగులైతే ఎదరకైనా.. నడక మాత్రం వెనకకే.. గడిచిపోయిన జ్ఞాపకాలతో గతము ఎదురవుతున్నదే.. చెరిగిపోనే లేదే.. మరపురానే రాదే.. ఊహలే ఉప్పొంగుతున్నవిలా.. ముగియని కథలతో మది మేలుకున్నదిలా’’ అంటూ సాగే ఈ చక్కటి మెలోడి హృదయాన్ని హత్తుకునేలా ఉంది.
పల్లెటూరి నేపథ్యంలో మనుషుల మధ్య బంధాలు, సంబంధాలు.. కుటుంబ విలువలు చాటిచెప్తూ రూపొందించిన ‘ప్రతిరోజూ పండగే’ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.