సంజూ భాయ్‌తో చిరు, చరణ్

రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ని కలిసారు. చిరు, చరణ్, సంజూ భాయ్‌ని కలిసిన ఫోటోలను చెర్రీ వైఫ్ ఉపాసన షేర్ చేసింది. 

  • Published By: sekhar ,Published On : January 10, 2019 / 10:33 AM IST
సంజూ భాయ్‌తో చిరు, చరణ్

Updated On : January 10, 2019 / 10:33 AM IST

రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ని కలిసారు. చిరు, చరణ్, సంజూ భాయ్‌ని కలిసిన ఫోటోలను చెర్రీ వైఫ్ ఉపాసన షేర్ చేసింది. 

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా, మరికొద్ది గంటల్లో థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ సాయంత్రమే యూఎస్‌లో ప్రీమియర్స్ పడబోతున్నాయి. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ని కలిసారు. చిరు, చరణ్, సంజూ భాయ్‌ని కలిసిన ఫోటోలను చెర్రీ వైఫ్ ఉపాసన షేర్ చేసింది. 
గతంలో చరణ్, బాలీవుడ్‌లో నటించిన జంజీర్ సినిమా టైమ్‌లోనూ పలుసార్లు సంజయ్ దత్‌ని కలిసాడు. మిస్టర్ సి ఇన్ కన్వెర్జేషన్ విత్ సంజూ భాయ్, ఏన్ ఈవెనింగ్ టు రిమెంబర్ ఫరెవర్ అంటూ, సంజయ్ దత్‌తో మెగా ఫాదర్ అండ్ సన్ కలిసి తీసుకున్న ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది మెగా కోడలు.

ఈ ఫోటోలిప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మెగాభిమానులు ఈ పిక్స్‌ని తెగ షేర్ చేస్తున్నారు.
బోయపాటి డైరెక్షన్‌లో చరణ్, కైరా అద్వాణీ నటించిన వినయ విధేయ రామ, లవ్, యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటించాడు. ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ (జీన్స్ ఫేమ్), స్నేహా, మధుమిత తదితరులు నటించిన వినయ విధేయ రామ సినిమాకి, సంగీతం : దేవిశ్రీప్రసాద్, నిర్మాత : డివివి.దానయ్య.

వాచ్, రామా లవ్స్ సీత సాంగ్ ప్రోమో…