Balagam : బలగం టీంకి చిరంజీవి సన్మానం..

జబర్దస్త్ స్టార్ కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ‘బలగం’. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. కాగా నేడు చిరంజీవి బలగం టీంని అభినందిస్తూ సన్మానం చేశాడు.

Balagam : బలగం టీంకి చిరంజీవి సన్మానం..

chiranjeevi appreciate balagam movie director venu priyadarshi dil raju

Updated On : March 11, 2023 / 12:31 PM IST

Balagam : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెరకెక్కిన సినిమా ‘బలగం’. ఈ చిత్రాన్ని జబర్దస్త్ స్టార్ కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి నిర్మించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ని దిల్ రాజు దగ్గర ఉండి చూసుకున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కేటిఆర్ ని గెస్ట్ గా ఆహ్వానించి గ్రాండ్ గా నిర్వహించాడు.

Harish Shankar : కేజీఎఫ్ పై కంచరపాలెం దర్శకుడు వ్యాఖ్యలు.. హరీష్ శంకర్ చురకలు!

ఇక మార్చి 3న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ ని కూడా గ్రాండ్ గా నిర్వహించారు. కాగా నేడు (మార్చి 11) చిరంజీవి బలగం టీంని అభినందిస్తూ సన్మానం చేశాడు. ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ షూటింగ్ లో ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమాని చూసిన చిరంజీవి.. భోళా శంకర్ సెట్ లో బలగం టీంతో కలిసి సందడి చేశాడు. అంత మంచి సినిమా తీసి మాకు షాక్ ఇస్తే ఎలా అంటూ దర్శకుడు వేణుని అభినందించాడు. తెలంగాణ సంస్కృతిని బాగా చూపించావు. దిల్ రాజు వంటి కమర్షియల్ ప్రొడ్యూసర్ ని వెంట పెట్టుకున్నా, ఎక్కడ కథ గాడి తప్పనివ్వకుండా ట్రూ ఎమోషన్స్ తో సినిమాని నడిపావు అంటూ ప్రశంసించాడు. అలాగే ఈ సినిమాలో నటించిన ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ని కూడా అభినందించాడు.

Pawan Kalyan : ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ నా ఫ్రెండ్ అని చెప్పుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నా.. ఎస్ జె సూర్య!

ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సినిమా రెండో వారం కూడా పూర్తి చేసుకుంటుంది. కమెడియన్ వేణు దర్శకుడిగా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. సినిమా బాగుంటే కమర్షియల్ సినేమానా? కదా? అని ఆడియన్స్ చూడరని ఈ సినిమా మరోసారి నిరూపించింది.