Harish Shankar : కేజీఎఫ్ పై కంచరపాలెం దర్శకుడు వ్యాఖ్యలు.. హరీష్ శంకర్ చురకలు!

‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ‘వెంకటేష్ మహా’.. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజీఎఫ్ పై సంచలన కామెంట్స్ చేశాడు. తాజాగా ఈ విషయం పై టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇన్‌డైరెక్ట్ గా స్పందించాడు.

Harish Shankar : కేజీఎఫ్ పై కంచరపాలెం దర్శకుడు వ్యాఖ్యలు.. హరీష్ శంకర్ చురకలు!

Harish Shankar reaction on Venkatesh Maha comments on kgf movie

Harish Shankar : ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ‘వెంకటేష్ మహా’.. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజీఎఫ్ పై సంచలన కామెంట్స్ చేశాడు. మేము విలువలు చూపిస్తూ మంచి సినిమాలు చేస్తే వాటిని విమర్శిస్తున్నారు. అదే ఒక నిచ్ కమీన్ గాడి మీద సినిమా తీస్తే చప్పట్లు కొట్టి గొప్ప సినిమా అంటున్నారు అంటూ కేజీఎఫ్ చిత్రాన్ని ఉదేశిస్తూనే కమర్షియల్ సినిమాలు తీసే దర్శకులను కూడా విమర్శించేలా మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లోనే కాదు శాండిల్‌వుడ్ లో కూడా తీవ్ర దుమారాన్ని లేపాయి.

RRR : ఆస్కార్ స్టేజి పై నాటు నాటు సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఎవరో తెలుసా?

తాజాగా ఈ విషయం పై టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇన్‌డైరెక్ట్ గా స్పందించాడు. బలగం సక్సెస్ మీట్ కి హాజరయిన హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో చాలా రోజులు నుంచి ఇది క్లాస్ సినిమా, మాస్ సినిమా, కమర్షియల్ సినిమా అని ఒక డిబేట్ నడుస్తుంది. ఇవన్నీ ఇండస్ట్రీ అండ్ మీడియా ఒక సినిమాని అడ్రెస్స్ చేయడానికి పెట్టుకున్న పేర్లు మాత్రమే. ఆడియన్స్ ఇవేమి చూడరు, కేవలం మంచి సినిమానా? కదా? అని మాత్రమే చూస్తారు. అలా చూశారు కాబట్టే ఇవాళ బలగం సక్సెస్ స్టేజి పై ఉన్నాము.

Rajamouli : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాజమౌళికి కీలక బాధ్యతలు..

శంకరాభరణం, సాగరసంగమ సినిమాలకు బండ్లు కట్టుకొని వెళ్లారంటూ విన్నాము. ఆ సినిమాల్లో సుమ్మోలు ఎగరలేదు, రక్తపాతాలు జరగలేదు. కానీ ఆ సినిమాలను కూడా మాస్ జనాలు ఆదరించారు. బాషా సినిమాలో నా పేరు మాణిక్యం అని చెప్పినప్పుడు దాని వెనుకున్న ఫ్లాష్ బ్యాక్ కి ఎలా గూస్‌బంప్స్ వచ్చాయో, సాగరసంగమ సినిమాలో ఇది భరతనాట్యం, ఇది కూచిపూడి అని చెబుతున్నప్పుడు కూడా దాని వెనుకున్న ఫ్లాష్ బ్యాక్ కి అలాంటి రియాక్షనే వచ్చింది.

నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే.. అన్న సాఫ్ట్‌వేర్, తమ్ముడు సివిల్ కాంట్రాక్ట్ జాబ్, ఇంకో తమ్ముడు బిజినెస్ చేసే ముగ్గురు అన్నదమ్ములు ఉన్న జాయింట్ ఫ్యామిలీలో ఒకర్ని ఒకరు కంపేర్ చేసుకోరు. క్లాస్ గా సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అన్న మాస్ గా సివిల్ కాంట్రాక్ట్ చేసే తమ్ముడ్ని తిట్టడు. అందుకనే అది జాయింట్ ఫ్యామిలీలా ఉంటుంది. ఇండస్ట్రీ అనేది కూడా ఒక జాయింట్ ఫ్యామిలీ. 300 కోట్ల పెట్టి తీసినా, 3 కోట్లు పెట్టి తీసినా ఇది మన సినిమా. మనం ఫైట్ చేయడానికి బయట చాలా సమస్యలు ఉన్నాయి. ఒకరు వచ్చి మనోభావాలు దెబ్బతిన్నాయి అంటాడు, ఇంకొకరు లిరిక్, డైలాగ్ అంటారు, మరో పక్క ఓటిటి కంపిటేషన్ లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనందరం వాటి మీద కలిసి పోరాడాలి గాని, మనం మనం కొట్టుకొని ఎదుట వారికీ చులకన కాకూడదు అంటూ వెల్లడించాడు.