Chiranjeevi : చిరంజీవి మాజీ అల్లుడు మృతి.. అనారోగ్యంతో హాస్పిటల్‌లో..

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గతంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది.

Chiranjeevi : చిరంజీవి మాజీ అల్లుడు మృతి.. అనారోగ్యంతో హాస్పిటల్‌లో..

Chiranjeevi ex son in law Srija Konidela ex Husband Sirish Bharadwaj Passed away with Health Issues

Updated On : June 19, 2024 / 11:07 AM IST

Chiranjeevi : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గతంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పట్లో శిరీష అతన్ని పెళ్లి చేసుకోడానికి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో పెద్ద వివాదమే అయింది. శిరీష్ భరద్వాజ్ – శ్రీజలకి నివ్రతి అనే కూతురు కూడా ఉంది. అయితే శ్రీజ ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ కి విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం శ్రీజ తన పిల్లలతో కలిసి చిరంజీవి దగ్గరే ఉంటుంది.

Also Read : Kalki Pre Release Event : నేడే ‘కల్కి’ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎన్నింటికి, లైవ్ ఎక్కడ చూడాలి?

అయితే తాజాగా శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం. గత కొంతకాలంగా లంగ్స్ డ్యామేజ్ తో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు శిరీష్ భరద్వాజ్. నేడు ఉదయం చికిత్స తీసుకుంటూనే హాస్పిటల్ లో శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లు సమాచారం. అయితే దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.