Chiranjeevi : చిరంజీవికి నిజంగానే మోకాలి సర్జరీ జరిగిందా? చిరంజీవి మోకాలి నొప్పిపై తమన్నా కామెంట్స్..
కొన్ని రోజుల క్రితం చిరంజీవి భోళా శంకర్ షూట్ అయ్యాక తన భార్యతో కలిసి అమెరికా ట్రిప్ కి వెళ్లారు. అందరికి ఇది వెకేషన్ ట్రిప్ అని చెప్పి వెళ్లారు, అలాగే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. కానీ చిరంజీవి మోకాలి సర్జరీకి వెళ్లినట్టు సమాచారం వచ్చింది.

Chiranjeevi Knee Surgery Rumors Tamannaah Comments goes viral
Chiranjeevi : చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో భోళా శంకర్(Bhola Shankar) సినిమాతో రాబోతున్నారు. మెహర్ రమేష్(Mehar Ramesh) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తమన్నా(Tamannaah) హీరోయిన్ గా తెరకెక్కిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా తమన్నా, డైరెక్టర్ మెహర్ రమేష్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో పలు ఆసక్తికర విషయాలని పంచుకుంది తమన్నా.
ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి మోకాలి నొప్పిపై మాట్లాడింది తమన్నా. ఇటీవల కొన్ని రోజుల క్రితం చిరంజీవి భోళా శంకర్ షూట్ అయ్యాక తన భార్యతో కలిసి అమెరికా ట్రిప్ కి వెళ్లారు. అందరికి ఇది వెకేషన్ ట్రిప్ అని చెప్పి వెళ్లారు, అలాగే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. కానీ చిరంజీవి మోకాలి సర్జరీకి వెళ్లినట్టు సమాచారం వచ్చింది. సోషల్ మీడియాల్లో, వార్తల్లో కూడా చిరంజీవి మోకాలి సర్జరీ కోసమే అమెరికాకు వెళ్లినట్టు వార్తలు వచ్చాయి.
తాజాగా భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ లో తమన్నా మాట్లాడుతూ.. చిరంజీవి గారికి మోకాలి నొప్పి ఉంది. ఒక సాంగ్ షూట్ లో చిరంజీవి గారికి మోకాలి నొప్పి ఎక్కువైంది. కానీ ఆయన ఎంత నొప్పి ఉన్నా బయటకి చెప్పకుండా షూట్ లో యూనిట్ కి తెలియకుండా వర్క్ చేశారు. తన వల్ల షూట్ ఆగిపోకూడదని, డైరెక్టర్, డ్యాన్స్ మాస్టర్ అడిగిన పర్ఫెక్షన్ ఇవ్వడానికి తన నొప్పిని దాచి పని చేశారు చిరంజీవి. అలాంటి డెడికేషన్, ఫ్యాషన్ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అని తెలిపింది. తమన్నా వ్యాఖ్యలతో చిరంజీవి భోళా శంకర్ సినిమా టైంలో మోకాలి నొప్పితో బాగా బాధపడ్డారని తెలుస్తుంది. దీంతో చిరంజీవి మోకాలి సర్జరీకి అమెరికా వెళ్లిన వార్తలు నిజమేనేమో అని భావిస్తున్నారు. తాజాగా చిరంజీవి నిన్నే బేబీ సక్సెస్ ఈవెంట్ లో కనిపించి ఫ్యాన్స్ ని అలరించారు.