Chiranjeevi : ఇది కదా మెగాస్టార్ అంటే.. ఆ చిన్నారిని కలిసి తన కోసం.. ప్రోమో వైరల్..

తాజాగా చిరంజీవి ఓ చిన్నారిని కలిసిన వీడియో వైరల్ గా మారింది. (Chiranjeevi)

Chiranjeevi : ఇది కదా మెగాస్టార్ అంటే.. ఆ చిన్నారిని కలిసి తన కోసం.. ప్రోమో వైరల్..

Chiranjeevi

Updated On : January 7, 2026 / 6:43 PM IST
  • చిరంజీవి గొప్పతనం
  • చిన్నారి వరుణవిని కలిసిన మెగాస్టార్
  • ప్రోమో వైరల్

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందికి ప్రేరణ. సినిమాల్లోనే హీరోగా కాకుండా బయట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలతో, అభిమానులకు కూడా అండగా నిలుస్తూ రియల్ హీరో అని చాలా సందర్భాల్లో అనిపించుకున్నారు. ఇక బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తో ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. చాలా మంది ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారు చిరంజీవి.(Chiranjeevi)

తాజాగా చిరంజీవి ఓ చిన్నారిని కలిసిన వీడియో వైరల్ గా మారింది. జీ తెలుగు ఛానల్ లో సరిగమప లిటిల్ చాంప్ అనే ప్రోగ్రాం వస్తుంది. ఈ ప్రోగ్రాంలో వరుణవి అనే చాలా చిన్న పాప తన పాటలతో, ముద్దు ముద్దు మాటలతో అందర్నీ మెప్పిస్తుంది. తనకు కంటికి సంబంధించిన సమస్య ఉన్నా కూడా పాటలతో అందర్నీ అలరిస్తుంది.

Also Read : Hyper Aadi : నాగబాబు ముందే.. పవన్ కళ్యాణ్ OG గెటప్ లో హైపర్ ఆది హడావిడి.. ప్రోమో వైరల్..

ఇప్పటికే ఈ ప్రోగ్రాంతో వరుణవి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈ షోకి జడ్జి గా చేస్తున్న అనిల్ రావిపూడి ఇటీవల చిరంజీవిని కలిపిస్తా అని వరుణవికి చెప్పాడు. చెప్పినట్టే చిరంజీవిని కలిపించారు.

చిరంజీవి చిన్నారి వరుణవిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని సరదాగా మాట్లాడారు. వరుణవి చిరంజీవి పాటలు, డైలాగ్స్ చెప్పి మెగాస్టార్ ని మెప్పించింది. చిరు సైతం ఆ చిన్నారి ట్యాలెంట్ కి అబ్బురపోయాడు. దాంతో ఆ చిన్నారికి భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను అని మాట ఇచ్చాడు. వరుణవి చిరంజీవిని కలిసిన విజువల్స్ ప్రోమోలో వేయగా ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Also Read : Rajasaab : ‘రాజాసాబ్’ టికెట్ రేట్ల పెంపు.. వామ్మో ప్రీమియర్ కి ఏకంగా..

ఇది కదరా మెగాస్టార్ అంటే, చిరు మంచితనం అని ఫ్యాన్స్, నెటిజన్లు మరోసారి చిరంజీవిని అభినందిస్తున్నారు. ఇక చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మన శంకర వరప్రసాద్ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. చిరంజీవి చిన్నారి వరుణవిని కలిసిన విజువల్స్ మీరు కూడా చూసేయండి..