Hyper Aadi : నాగబాబు ముందే.. పవన్ కళ్యాణ్ OG గెటప్ లో హైపర్ ఆది హడావిడి.. ప్రోమో వైరల్..

మీరు కూడా సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం స్పెషల్ ప్రోగ్రాం ప్రోమో చూసేయండి.. (Hyper Aadi)

Hyper Aadi : నాగబాబు ముందే.. పవన్ కళ్యాణ్ OG గెటప్ లో హైపర్ ఆది హడావిడి.. ప్రోమో వైరల్..

Hyper Aadi

Updated On : January 7, 2026 / 6:11 PM IST

Hyper Aadi : టీవీ షోలలో, స్పెషల్ ప్రోగ్రామ్స్ లో స్కిట్స్ వేస్తారని తెలిసిందే. అప్పుడప్పుడు కొన్ని సినిమాలను తీసుకొని వాటికి స్పూఫ్ స్కిట్స్ చేస్తుంటారు. తాజాగా హైపర్ ఆది OG సినిమా స్కిట్ చేయడం గమనార్హం. పండగలకు ప్రతి ఛానల్ స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తారు. ఈ సంక్రాంతికి ఈటీవి సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం అనే స్పెషల్ ప్రోగ్రాం చేసింది.(Hyper Aadi)

తాజాగా సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం ప్రోగ్రాం ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోగ్రాంలో హైపర్ ఆది పవన్ కళ్యాణ్ OG స్కిట్ వేసాడు. పవన్ కళ్యాణ్ OG గెటప్ లో వచ్చి వాషి ఓ వాషి అని జపాన్ డైలాగ్స్ చెప్తూ సందడి చేసాడు. పవన్ కళ్యాణ్ లాగే వెనుక ఓ నలుగురిని పెట్టుకొని స్టైల్ గా నడుచుకుంటూ వచ్చాడు. OG సినిమా పోలిస్ స్టేషన్ సీన్ ని రీ క్రియేట్ చేసారు.

Also Read : Rajasaab : ‘రాజాసాబ్’ టికెట్ రేట్ల పెంపు.. వామ్మో ప్రీమియర్ కి ఏకంగా..

మెగా బ్రదర్ నాగబాబు ఈ ప్రోగ్రాంకి గెస్ట్ గా వచ్చారు. దీంతో నాగబాబు ముందే హైపర్ ఆది ఇలా పవన్ కళ్యాణ్ OG గెటప్ వేసి హడావిడి చేయడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. అలాగే ఈ స్పెషల్ ప్రోగ్రాంకి అనిల్ రావిపూడి, రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వచ్చి సందడి చేసారు.

మీరు కూడా సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం స్పెషల్ ప్రోగ్రాం ప్రోమో చూసేయండి..

 

Also Read : Seetha Payanam : కూతురు హీరోయిన్ గా.. తండ్రి దర్శకుడిగా.. సీతా పయనం నుంచి పెళ్లి సాంగ్ చూశారా..?