Chiranjeevi Mother : అమ్మ ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్ళింది.. మేమంతా వెళ్లి.. తల్లి గురించి చిరంజీవి వ్యాఖ్యలు..
చిరంజీవి తల్లి అంజనా దేవి ఓ సమయంలో డిప్రెషన్ కి గురయింది అని మాట్లాడారు.

Chiranjeevi said his mother Anjana Devi suffered from depression at one point
Chiranjeevi Mother : నేడు ఉమెన్స్ డే సందర్భంగా చిరంజీవి తల్లి అంజనమ్మతో చిరంజీవి, నాగబాబు, మాధవి, విజయ దుర్గ.. లతో మెగా వుమెన్ అని స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో చిరంజీవి తల్లి అంజనా దేవి ఓ సమయంలో డిప్రెషన్ కి గురయింది అని మాట్లాడారు.
చిరంజీవి మాట్లాడుతూ.. నాన్న చనిపోయినప్పుడే కొన్ని రోజులకు అమ్మ వల్ల అమ్మ కూడా చనిపోయారు. దాంతో అమ్మ కాస్త డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. బాగా బాధపడేది. అప్పుడు అమ్మానాన్న వేరే దగ్గర ఉండేవాళ్ళు. అమ్మ అలా అయిపోవడంతో మేము మా దగ్గరికి వచ్చేయమన్నాం. కానీ మొదట నో అంది. నువ్వు రాష్ట్రం అంతా గొప్పగా పొగిడే కొడుకులను కన్నావు. మంచి పిల్లలను కన్నావు. అందరూ నిన్ను పొగుడుతున్నారు, నీ పిల్లలను పొగుడుతున్నారు. అలాంటి నువ్వు ఇలా డల్ అయిపోవడం ఏంటి. మంచి హై యాక్టివ్ గా ఉండాలి. అంతేకాని నువ్వు ఇలా కుంగిపోవడం ఏంటి, నువ్వు మాతో ఉండు అని అమ్మతో చెప్తే అవును అని మా దగ్గరకు వచ్చేసింది.
Also Read : Chiranjeevi : ఆ సినిమా కోసం ట్రైన్ మీద రియల్ సీన్.. నాన్న చూసి పిచ్చ తిట్లు.. చరణ్ ని మగధీరలో అలా చూశాక..
అప్పుడు ఒక్కసారే అమ్మ కాస్త డిప్రెషన్ లోకి వెళ్లి బాధపడింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అమ్మ బాధపడలేదు. అమ్మ ప్రస్తుతం మా ఇంట్లోనే ఉంటుంది. నాగబాబు కానీ, చెల్లెల్లు కానీ మా ఇంట్లో అందరూ వాళ్లకు కుదిరినప్పుడల్లా వచ్చి అమ్మతో సమయం గడుపుతారు. షూటింగ్స్, వర్క్ బిజీ లీకపోతే అందరూ అమ్మ దగ్గరికి వస్తారు అని తెలిపారు మెగాస్టార్. దీంతో చిరంజీవి తల్లి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
మెగా వుమెన్ స్పెషల్ ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..