Chiranjeevi : డైరెక్టర్ చెప్పినా ఆ విషయంలో చిరంజీవి నో చెప్పారట.. గ్రేట్ అంటున్న ఫ్యాన్స్..

ఇంతకీ చిరంజీవి నో చెప్పింది దేనికో తెలుసా?

Chiranjeevi : డైరెక్టర్ చెప్పినా ఆ విషయంలో చిరంజీవి నో చెప్పారట.. గ్రేట్ అంటున్న ఫ్యాన్స్..

Chiranjeevi said no to Director Decision in a Movie

Updated On : April 9, 2025 / 8:46 PM IST

Chiranjeevi : ఓ సినిమాలో డైరెక్టర్ చెప్పిన దానికి నో చెప్పారట మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ ఎంత చెప్పినా చిరంజీవి కన్విన్స్ కాలేదట. కావాలంటే ఇలా చేయండి అంటూ సలహా ఇచ్చారట. ఇంతకీ చిరంజీవి నో చెప్పింది దేనికో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా చేసినా అందులో స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఆ ఐటెం సాంగ్‌లో చిరు వేసే కొత్త స్టెప్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. అయితే ఓ సినిమాలో మాత్రం ఐటమ్ సాంగ్ పెట్టడానికి చిరు అసలు ఒప్పుకోలేదట. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కలిసి ఓ ఐటమ్ సాంగ్ రెడీ చేశారంటా. సాంగ్ కూడా బాగా వచ్చిందంటున్నారు. కానీ మెగాస్టార్ మాత్రం అసలు ఆ సాంగ్ పెట్టొద్దని డైరెక్టర్‌కు చెప్పారట.

Also Read : NTR – Anthony : ఎన్టీఆర్ పొగిడిన యాంథోని ఎవరో తెలుసా?.. అసలు నటుడే కాదు కానీ..

వశిష్ట డైరెక్టర్‌గా మెగాస్టార్ చిరంజీవి కలిసి చేస్తున్న మైథాలజికల్ యాక్షన్ మూవీ విశ్వంభర. ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ పెట్టాలని డైరెక్టర్ డిసైడ్ అయ్యారట. పాట రాయించి మ్యూజిక్ కూడా చేయించారట. కానీ ఈ ఐటమ్ సాంగ్‌ను విశ్వంభర మూవీలో పెట్టడానికి చిరు అస్సలు ఒప్పుకోలేదట.

విశ్వంభర హిందూ మైథాలజీ సినిమా కావడంతో ఐటమ్ సాంగ్ లాంటివి వద్దని చిరు చెప్పారని టాక్. ఐటమ్ సాంగ్‌కు బదులు కావాలంటే శ్రీ మంజునాథలోని ఓం మహా ప్రాణం దీపం.. లాంటి మంచి డివోషనల్ పాటను పెట్టండి అని చెప్పారట. దీంతో డైరెక్టర్ వశిష్ట, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అలాంటి సాంగ్ రెడీ చేసే పనిలో పడ్డారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే మైథలాజికల్ సినిమాలో చిరంజీవి ఐటెం సాంగ్ వద్దు అన్నారని తెలియడంతో ఫ్యాన్స్ అది బాస్ అంటే అని, గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు.

Also Read : Renu Desai – Akira Nandan : అలాంటి తప్పుడు థంబ్ నెయిల్స్ ఆపండి.. అకిరాని కొంతమంది తిడుతున్నారు..

ఇక విశ్వంభర సినిమా ఇప్పటికే వాయిదా పడగా జులై 24న రిలీజ్ చేస్తారు అని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం షూట్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు మూవీ యూనిట్.