Chiru – Venky : వెంకీ మామని ‘వేర్ ఈజ్ ది పార్టీ’ అంటున్న వీరయ్య..

టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుపాటి వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విక్టరీనే తన ఇంటి పేరుగా మార్చుకున్న వెంకీ మామ..

Chiru – Venky : వెంకీ మామని ‘వేర్ ఈజ్ ది పార్టీ’ అంటున్న వీరయ్య..

Chiranjeevi wishes venkatesh on his birthday

Updated On : December 13, 2022 / 2:31 PM IST

Chiru – Venky : టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుపాటి వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విక్టరీనే తన ఇంటి పేరుగా మార్చుకున్న వెంకీ మామ.. టాలీవుడ్ లో ఎటువంటి కాంట్రవర్సి లేని హీరో. డిసెంబర్ 13న జన్మించిన ఈ దగ్గుపాటి హీరో 1986లో ‘కలియుగ పాండవులు’తో వెండితెర అరంగేట్రం చేశాడు. 36 ఏళ్ళ సినీ కెరీర్ లో వెంకటేష్.. 7 నంది అవార్డులు, 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు.

Chiranjeevi : యువ హీరోలపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇక ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోకి వెంకీ మామతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా చిరు, వెంకీ మధ్య స్నేహం అయితే అల్టిమేట్ అనే చెప్పాలి. దీంతో వెంకటేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరంజీవి చేసిన ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటుంది. “మై డియర్ వెంకీ, హ్యాపీ బర్త్ డే. వేర్ ఈజ్ ది పార్టీ” అంటూ వెంకీ మామతో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేశాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా వెంకీ ప్రస్తుతం తెలుగులో ఏ ప్రాజెక్ట్ చేయడం లేదు. హిందీలో కండల వీరుడు సల్మాల్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్ లో ‘రానా నాయుడు’ అనే ఒక హిందీ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ రెండు వచ్చే ఏడాదే విడుదల కానున్నాయి.