Chola Vs Pandya : PS 2 సినిమాతో తమిళనాడులో చోళ వర్సెస్ పాండ్య రచ్చ.. పాండ్య వారసులం అంటూ ఐశ్వర్య రాయ్ ఫొటోతో పోస్టర్స్..

ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కూడా చోళ వర్సెస్ పాండ్య కథ చూపించారు. చోళ రాజుని ఓ పాండ్య మహిళ ఎలా చంపేసింది అనేదే క్లైమాక్స్ లో చూపించారు.

Chola Vs Pandya : PS 2 సినిమాతో తమిళనాడులో చోళ వర్సెస్ పాండ్య రచ్చ.. పాండ్య వారసులం అంటూ ఐశ్వర్య రాయ్ ఫొటోతో పోస్టర్స్..

Chola Vs Pandya issue happens in tamilanadu due to PS2 movie

Chola Vs Pandya :  గత సంవత్సరం మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమా రిలీజయింది. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభిత, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, జయరాం.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రిలీజయింది. అయితే పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 తమిళ్ లో భారీ విజయం సాధించినప్పటికీ మిగిలిన చోట్ల మాత్రం అంతగా విజయం సాధించలేదు. తాజాగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 రిలీజయింది.

పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 పర్వాలేదనిపిస్తుంది. అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి ఈ సినిమాకు. ఈ సినిమా చోళులు వర్సెస్ పాండ్య కథ అని అందరికి తెలిసిందే. ఒకప్పుడు తమిళనాడు రాజ్యాన్ని చోళులు, పాండ్యులు పరిపాలించారు. కొన్ని వేల సంవత్సరాలు తమిళనాడులో చోళ వర్సెస్ పాండ్య యుద్దాలు జరిగాయి. రాచరిక పాలన అంతరించినా ఇప్పటికి తమిళనాడులో చోళ వర్సెస్ పాండ్య అంటూ అప్పుడప్పుడు రచ్చ జరుగుతూనే ఉంటుంది. గతంలో వచ్చిన యుగానికి ఒక్కడు సినిమాలో కూడా చోళ వర్సెస్ పాండ్య అనే కథే చూపించారు.

ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కూడా చోళ వర్సెస్ పాండ్య కథ చూపించారు. చోళ రాజుని ఓ పాండ్య మహిళ ఎలా చంపేసింది అనేదే క్లైమాక్స్ లో చూపించారు. ఇది నిజంగా జరిగిన కథ నుంచే తీసుకున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ పాండ్య మహిళగా నటించింది. దీంతో తమిళనాడులో, ముఖ్యంగా పాండ్యులు పాలించిన మధురలో ఐశ్వర్యరాయ్ ఫోటోతో పోస్టర్లు అంటించారు. ఈ పోస్టర్లు ప్రస్తుతం తమిళనాడులో కలకలం రేపుతున్నాయి.

Ponniyin Selvan 2 : పార్ట్ 1 తో పోలిస్తే ఇదే బెటర్ అంట.. పొన్నియిన్ సెల్వన్ 2 ట్విట్టర్ రివ్యూ..

ఈ పోస్టర్ల మీద.. సిస్టర్ నందిని.. పాండ్యుల ఆశాకిరణం. ఆఖరి ఆయుధం. ప్రపంచంలోని తొలి మహిళా పాండ్య రాణి మీనాక్షి అమ్మ దయతో మమ్మల్ని కంటతడి పెట్టించిన చోళులు మమ్మల్ని ఎంతో దారుణంగా చూశారు. ఇప్పుడు మా వైపు చోళులు ఇంకోసారి చూడరు. ఇట్లు పాండ్యుల వారసులు అంటూ రాశారు. ఐశ్వర్య రాయ్ ఫొటోతో ఉన్న ఈ పోస్టర్స్ మధుర, తమిళనాడులో సంచలనం సృష్టించాయి. దీంతో మరోసారి తమిళనాడులో చోళ వర్సెస్ పాండ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురు దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై చిత్రయూనిట్ మాత్రం ఇంకా స్పందించలేదు.