Yash : కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా దిల్ రాజు సినిమా.. ‘ఆకాశం దాటి వస్తావా’
కొత్త వాళ్లను ప్రోత్సహించేందుకు, కొత్త కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించేందుకు దిల్ రాజ్ ప్రొడక్షన్స్(Dil Raju Productions) అనే నిర్మాణ సంస్థను స్థాపించారు నిర్మాత దిల్ రాజు(Dil raju).
Choreographer Yash : కొత్త వాళ్లను ప్రోత్సహించేందుకు, కొత్త కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించేందుకు దిల్ రాజ్ ప్రొడక్షన్స్(Dil Raju Productions) అనే నిర్మాణ సంస్థను స్థాపించారు నిర్మాత దిల్ రాజు(Dil raju). ఈ నిర్మాణ సంస్థకు దిల్ రాజు కూతురు హన్షితా రెడ్డి, అన్న కొడుకు హర్షిత్ రెడ్డి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ నుంచి వచ్చిన మొదటి సినిమా బలగం. ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండో సినిమా ఏం వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సోమవారం తమ రెండో సినిమాకు సంబంధించిన టైటిల్‌ని ప్రకటిస్తూ ఓ స్పెషల్ వీడియోను నిర్మాణ సంస్థ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సినిమాకు ఆకాశం దాటి వస్తావా(Aakasam Dati Vasthava) అనే పేరును ఖరారు చేశారు. కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న యష్ మాస్టర్ ఈ సినిమాతో హీరోగా మారనున్నాడు. కార్తీక మురళీధరన్ హీరోయిన్ కాగా శశికుమార్ ముత్తులూరి దర్శకుడిగా, గాయకుడు కార్తీక్ ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
MM Keeravaani : చంద్రముఖి-2కి ప్రాణం పోసేందుకు రెండు నెలలు నిద్రలేని రాత్రులు
ఈ సినిమా గురించి ప్రేక్షకులకు తెలియజేయడానికి దిల్ రాజ్ ప్రొడక్షన్స్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ అని చెప్పారు. దర్శకుడు శశి తన జీవితంలో జరిగిన విషయాలనే కథగా రాసుకున్నారన్నారు. ఈ చిత్రానికి సంగీతం బలమని, కార్తీక్ అన్ని పాటలూ అద్భుతంగా చేశారన్నారు. బలగం సినిమా షూటింగ్ సమయంలోనే ఈ సినిమా గురించి ప్రస్తావన వచ్చిందని, అందరూ కొత్త వారే కావాలని దర్శకుడు శశికి చెప్పినట్లు దిల్ రాజ్ చెప్పారు. కొరియోగ్రాఫర్ యశ్ ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడని చెప్పారు. ప్రేమలో ఉన్నప్పుడు చాలా మంది గొప్పగా మాట్లాడుతుంటారు. వాటిల్లోంచి వచ్చిందే ఈ సినిమా టైటిల్ అని దిల్ రాజు అన్నారు.
Get ready to be enchanted by the musical love tale of #AakasamDhaatiVasthaava ❤️
Introducing 🌟
Supremely talented Choreographer 𝐘𝐚𝐬𝐡 as the lead actor,
𝐊𝐚𝐫𝐭𝐡𝐢𝐤𝐚 𝐌𝐮𝐫𝐚𝐥𝐞𝐞𝐝𝐡𝐚𝐫𝐚𝐧 as the female lead, pic.twitter.com/xnM9w43pvv— Dil Raju Productions (@DilRajuProdctns) July 24, 2023
దిల్ రాజు నుంచి ఫోన్ వస్తే పాటలకు కొరియోగ్రఫీ చేయాలేమో అని అనుకున్నాను. అయితే.. ఈ సినిమాలో తానే హీరోనని చెప్పేసరికి షాక్‌కు గురి అయినట్లు యశ్ చెప్పాడు.
Tillu Square : టిల్లు స్క్వేర్ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. బాయ్ ఫ్రెండ్ లేడంటే నిన్ను..