Cockroach : ఇప్పుడు ‘కాక్రోచ్’ మీద సినిమా.. ఆడదాని దెబ్బకు చస్తుంది..
దసరా సందర్భంగా నిన్న ఈ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.

Cockroach Movie Announced with Interesting Poster on Dasara
Cockroach : రాజమౌళి ఈగ మీద సినిమా వచ్చాక చాలానే జంతువులు, పక్షులు, కీటకాలు ముఖ్య పాత్రలుగా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు బొద్దింక మీద సినిమా రాబోతుంది. బి బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మాణంలో పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కాక్రోచ్’.
దసరా సందర్భంగా నిన్న ఈ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ఓ బొద్దింకపై కాక్రోచ్ అనే టైటిల్ పెట్టగా.. అణుయుద్ధాన్ని అయినా గెలుస్తుంది కానీ ఆడదాని దెబ్బకు చస్తుంది అనే ఆసక్తికర కొటేషన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
ఇక ఈ కాక్రోచ్ సినిమా విశాఖపట్నం నేపథ్యంలో సాగే ఓ వైలెంట్ యాక్షన్ ప్రేమ కథ అని సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ తెలిపారు.