Praveen : హీరోగా మారిన మరో కమెడియన్.. ‘బకాసుర రెస్టారెంట్‌’ తో కాస్త ప్రెజర్ ఫీల్ అయ్యాను..

ఇప్పుడు ప్రవీణ్ హీరోగా మారాడు.

Praveen : హీరోగా మారిన మరో కమెడియన్.. ‘బకాసుర రెస్టారెంట్‌’ తో కాస్త ప్రెజర్ ఫీల్ అయ్యాను..

Comedian Praveen

Updated On : August 7, 2025 / 9:31 AM IST

Praveen : పలు సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రవీణ్‌. ఇప్పుడు ప్రవీణ్ హీరోగా మారాడు. ‘బకాసుర రెస్టారెంట్‌’ అనే హారర్ హంగర్‌ కామెడీ సినిమాతో ప్రవీణ్ హీరోగా రాబోతున్నాడు. ఎస్‌జే శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైవా హర్ష, కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఎస్‌జే మూవీస్‌ బ్యానర్ పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మించగా ఆగస్టు 8న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

బకాసుర రెస్టారెంట్‌ గురించి ప్రవీణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ముఖ్యంగా ఐదు పాత్రలతో నడుస్తుంది. ఇందులో కథను నడిపించే పరమేష్‌ అనే పాత్రలో నేను కనిపిస్తాను. నా పాత్రలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌ కూడా ఉంటుంది. నా పాత్రకు ఉండే ఓ యాంబిషన్‌ ఎలా ఫుల్‌ఫిల్‌ అయ్యింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఓ తిండిబోతు దెయ్యం పెట్టే ఇబ్బంది చాలా ఎంటర్‌టైనింగ్‌గా, ఎమోషన్‌ల్‌గా ఉంటుంది. నా పాత్రలో ఎమోషన్‌ను పండించడమే నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. కామెడీతో కథ నడిచినా క్లైమాక్స్ లో ఎమోషన్ వస్తుంది. మన జీవితంలోకి వచ్చిన మంచి స్నేహితుడు వెళ్లిపోవాల్సి వస్తే మనలో ఎలాంటి పెయిన్‌ ఉంటుందో సినిమాలో అదే ఉంటుంది అని తెలిపారు.

Also Read : PVNS Rohit : మొన్నే నేషనల్ అవార్డు గెలుచుకున్న సింగర్.. తాజాగా ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం..

కమెడియన్ నుంచి హీరోగా మారడంపై మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే ఇలా మెయిన్ లీడ్ చేయడం కొంచెం బరువే. పర్‌ఫార్మెన్స్‌ వైజ్‌ నాది రెగ్యులర్‌ పాత్ర కాదు. కథను నడిపించే పాత్ర కావడంతో కాస్త టెన్షన్‌గానే ఉంది. సినిమాను ప్రమోషన్‌తో బయటికి తీసుకురావాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే కాస్త ప్రెజర్ అయితే ఫీల్ అయ్యాను. ఈ విషయంలో నాకు సినీ పరిశ్రమలో ప్రముఖులు సహకరిస్తున్నారు. కమెడియన్ హీరోగా మారితే అవకాశాలు తగ్గుతాయి అంటారు కానీ నేను హీరోగా ఫీలయితే అలాంటి ఫీలింగ్‌ అందరిలో వస్తుంది. నేను ఓ సినిమాలో లీడ్‌ రోల్‌ చేస్తున్నాననే భావనలో మాత్రమే ఉన్నాను. దీని తర్వాత కూడా నేను విశ్వంభర, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, మాస్‌ జాతర, లెనిన్‌, ఆకాశంలో ఓ తార.. సినిమాల్లో నటుడిగా చేస్తున్నాను. నాకు ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తాను. భవిష్యత్తులో కూడా మెయిన్ లీడ్ వచ్చినా కామెడీ ప్రధానాంశం అయితే చేస్తాను అని తెలిపారు.

ఇక ఈ సినిమాని శిరీష్‌ గారు చూసి మెచ్చుకున్నారు. ఎడిటింగ్ లో కొన్ని ఛేంజెస్ చెప్పారు. అందుకు మేము ఓకే చెప్పాము. దాంతో వాళ్లకు సినిమా నచ్చి దిల్ రాజు గారు విడుదల చేస్తున్నారు అని తెలిపారు.

Also Read : Mayasabha : ‘మయసభ’ సిరీస్ రివ్యూ.. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిల స్నేహంపై వెబ్ సిరీస్..