Hyper Aadi: జబర్దస్త్ హైపర్ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు

జబర్దస్త్ కమెడీయన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ కార్యక్రమంలో తెలంగాణ భాషనీ, సంస్కృతిని, బతుకమ్మ, గౌరమ్మలను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ సోమవారం ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.

Hyper Aadi:  జబర్దస్త్ హైపర్ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు

Hyper Aadi

Updated On : June 15, 2021 / 11:40 AM IST

Hyper Aadi: జబర్దస్త్ కమెడీయన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ కార్యక్రమంలో తెలంగాణ భాషనీ, బతుకమ్మ, గౌరమ్మలను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ సోమవారం ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.

ఆ స్కిట్ రైటర్ తోపాటు మల్లెమాల ప్రొడక్షన్ పై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ ఫిర్యాదు చేసిన వారిలో జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్, సమాచార హక్కు సాధన స్రవంతి, కార్యదర్శి కార్తీక్ తదితరులు ఉన్నారు.

ఇక గతంలో కూడా ఆదిపై పలు ఆరోపణలు వచ్చాయి. అనాథపిల్లల మనోభావాలు దెబ్బతీసేలా స్కిట్ చేశారంటూ ఆదిపై కత్తి మహేష్ గతేడాది హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు.