టాప్ హీరోలకి డైరెక్టర్ల కండీషన్!

  • Published By: veegamteam ,Published On : May 3, 2019 / 12:38 PM IST
టాప్ హీరోలకి డైరెక్టర్ల కండీషన్!

Updated On : May 3, 2019 / 12:38 PM IST

టాలివుడ్ టాప్ హీరోలంతా ఇప్పుడు జిమ్ లో తెగ కష్టపడిపోతున్నారు. హీరోలందరికి డైరెక్టర్లు వెయిట్ లాస్ అవ్వమని కండీషన్ పెడుతున్నారు. ఖచ్చితంగా క్యారెక్టర్ కి తగ్గట్లు ఫిజిక్ ఉండి తీరాల్సిందే అని డిమాండ్ చేస్తుండటంతో హీరోలు కష్టమైనా సరే కసరత్తులు చేసేందుకు రెడీ అవుతున్నారు. క్యారెక్టర్ కోసం కాస్ట్యూమ్స్ వేసుకోవడమే కాదు ఫిజిక్ కూడా కావాలని డైరెక్టర్స్ కండీషన్ పెడుతుండటంతో హీరోలు అర్జెంట్ గా బరువు తగ్గే పనిలోపడ్డారు. సాహో సినిమా తర్వాత రాధాకృష్ణ డైరెక్షన్ లో రాబోతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కోసం ప్రభాస్ 8 కేజీలు వెయిట్ లాస్ అయ్యాడు. రీసెంట్ గా ప్రభాస్ ఫ్యాన్స్ ని కలిసిన వీడియో లో డార్లింగ్ బరువు తగ్గినట్లు క్లియర్ గా తెలుస్తోంది.

సినిమా కోసం కమిట్మెంట్ తో పనిచేయడంలో ఈ జనరేషన్ హీరోలందరికీ రోల్ మోడల్ మెగాస్టార్ చిరంజీవి. పాత్రలో పెర్ఫెక్షన్ కోసం చిరూ ఎంత కష్టమైనా పడతారు. సైరా తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ సినిమా చేయనున్నాడు. అయితే కొరటాల తన సినిమాలో చిరు క్యారెక్టర్ ని కాస్త యంగ్ గా డిజైన్ చేసినట్లు సమాచారం. అందుకే సైరా షూటింగ్ పూర్తికాగానే చిరంజీవి వెయిట్ లాస్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు.  

ఇక ఇన్నాళ్లు తన వెయిట్ విషయాన్ని పెద్దగా పట్టించుకోని బాలకృష్ణ కూడా ఇప్పుడు బరుగు తగ్గేందుకు డిసైడ్ అయ్యాడు. బోయపాటి డైరెక్షన్ లో చేయబోయే సినిమాలో బాలయ్య స్లిమ్ గా కనిపించబోతున్నాడు. ఏకంగా 20 కిలోల వరకు బాలకృష్ణ బరువు తగ్గాలనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. అంత వెయిట్ తగ్గాలంటే మినిమం మూడు నెలలు కష్టపడాల్సిందే. బోయపాటి సినిమాని పోస్ట్ పోన్ చేయడానికి ఇదికూడా ఓ రిజన్ అని ప్రచారం జరుగుతోంది. ఇలా టాప్ హీరోలంతా స్లిమ్ముగా మారి సీన్ సితార్ చేసేందుకు రెడీ అవుతున్నారు.