మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
దుబాయ్‌లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

దుబాయ్‌లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొఫెషన్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో, పర్సనల్ లైఫ్‌కి అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. షూటింగ్‌కి కాస్త గ్యాప్ దిరికితే చాలు, భార్యా, పిల్లల్ని తీసుకుని విదేశాల్లో వాలిపోతాడు. ఇప్పుడు కూడా మహర్షి షూట్‌కి కొంచెం గ్యాప్ ఇవ్వడంతో, న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి దుబాయ్ వెళ్ళాడు. చిల్లింగ్ ఎట్ మిక్స్ విత్ బాయ్స్, ది న్యూ హాట్ స్పాట్ అంటూ, అక్కడ సరదాగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న ఒక ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేసాడు.
క్యాజువల్ లుక్‌లోనే సూపర్‌గా ఉన్నాడు సూపర్ స్టార్.. జనరల్‌గా మహేష్, గౌతమ్, సితారల ఫోటోలు లాంటివి నమ్రత పోస్ట్ చేస్తుంటుంది. కానీ, ఈ సారి స్వయంగా మహేష్ బాబే పోస్ట్ చెయ్యడం విశేషం. మొత్తానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని గట్టిగా జరుపుకోబోతున్నాడని అర్థమవుతుంది. నూతన సంవత్సరం సందర్భంగా మూవీ యూనిట్, మహర్షి సెకండ్ లుక్ రిలీజ్ చెయ్యగా, అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. కొద్ది రోజుల తర్వాత తిరిగి మహర్షి షూటింగ్‌కి అటెండ్ అవుతాడు మహేష్.