Sudheer Babu Hunt Movie: సుధీర్ బాబు సినిమా “హంట్” టైటిల్ పై వివాదం..

సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ "హంట్". భవ్య క్రియేషన్స్ పథకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివల ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ మాది అంటూ "శ్రీ క్రియేషన్స్" నిర్మాతలు నిరసన తెలుపుతున్నారు.

Sudheer Babu Hunt Movie: సుధీర్ బాబు సినిమా “హంట్” టైటిల్ పై వివాదం..

Controversy over the title of Sudhir Babu's movie Hunt

Updated On : October 17, 2022 / 6:18 PM IST

Sudheer Babu Hunt Movie: సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “హంట్”. భవ్య క్రియేషన్స్ పథకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివల ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ మాది అంటూ “శ్రీ క్రియేషన్స్” నిర్మాతలు నిరసన తెలుపుతున్నారు.

Sudheer Babu Hunt Teaser: సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు ‘హంట్’ టీజర్!

శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై నిక్షిత్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హంట్’. దాదాపు చిత్రీకరణ పూర్తీ చేసుకొని విడుదలకు సిద్దమవుతున్న సమయంలో సుదీర్ బాబు సినిమాకు అదే టైటిల్ ని పెట్టడంతో షాక్ కి గురయ్యారు మూవీ టీం. దీంతో భవ్య క్రియేషన్స్ వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో వివాదం రాచుకుంది.

నిర్మాత నర్సింగ్ రావు మాట్లాడుతూ.. “మేము మా శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై హంట్ టైటిల్ ను రిజిస్టర్ చేసాం. షూటింగ్ కూడా జరుపుకుంటున్నాం. సడన్ గా ఒకరోజు హంట్ టైటిల్ తో సుధీర్ బాబు గారి పోస్టర్ కనిపించింది. వెంటనే భవ్య క్రియేషన్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం. కానీ వాళ్ళు సరిగ్గా స్పందించలేదు. చాలా సార్లు మాట్లాడటానికి ప్రయత్నం చేసాము కానీ ఫలితం లేదు. చాంబర్ వాళ్ళు కూడా ప్రయత్నం చేసారు కానీ ఫలితం లేదు. మా చిత్ర ఆడియో రైట్ అమ్మటానికి ప్రయత్నం చేసాం కానీ హంట్ పేరు తో వేరే చిత్రం ఉంది మేము మీ చిత్రం కొనలేము అని తెలిపారు. మా న్యాయం కావాలి” అని తెలిపారు