‘లెట్స్ ఫైట్ దిస్ వైరస్’ – వైరల్ అవుతున్న వీడియో సాంగ్
మెగాస్టార్ చిరంజీవి చైర్మన్‌గా ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ ఆధ్వర్యంలో కరోనాపై స్పెషల్ సాంగ్..

మెగాస్టార్ చిరంజీవి చైర్మన్‌గా ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ ఆధ్వర్యంలో కరోనాపై స్పెషల్ సాంగ్..
కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతలు, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు.
కరోనా కట్టడికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సి. సి. సి. (కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం) అనే సంస్థను ఏర్పాటు చేశారు. షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్ చారిటీ’కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా కరోనాపై స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘నీ చేతల్లోనే కదా భవిత’.. అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ కోటి కంపోజ్ చేయగా శ్రీనివాస్ మౌళి లిరిక్స్ అందించారు..
ఈ వీడియో సాంగ్‌లో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కోటి నటించారు. ‘లెట్స్ ఫైట్ దిస్ వైరస్’ అంటూ ప్రజలను చైతన్యపరిచేలా ఉన్న ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంటోంది.