Nora Fatehi: బీ టౌన్ సెలబ్రిటీలను వదలని కరోనా.. నోరాకూ పాజిటివ్!

దక్షణాదితో పోల్చితే ఉత్తరాదిన కరోనా విజృంభణ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వ్యాప్తి కొనసాగుతుంది. దీంతో బాలీవుడ్ ప్రముఖులు పలువురు కరోనా బారిన పడుతున్నారు. ఈ మధ్యనే కరీనా..

Nora Fatehi: బీ టౌన్ సెలబ్రిటీలను వదలని కరోనా.. నోరాకూ పాజిటివ్!

Nora Fatehi

Updated On : December 30, 2021 / 8:56 PM IST

Nora Fatehi: దక్షణాదితో పోల్చితే ఉత్తరాదిన కరోనా విజృంభణ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వ్యాప్తి కొనసాగుతుంది. దీంతో బాలీవుడ్ ప్రముఖులు పలువురు కరోనా బారిన పడుతున్నారు. ఈ మధ్యనే కరీనా కపూర్ కు కరోనా సోకి కోలుకోగా తాజాగా బోణీ కపూర్ వారసులకు కరోనా సోకింది. అర్జున్ కపూర్, అయన సోదరి సోదరి అన్షులా కపూర్‌కు డిసెంబర్ 29న మహ్మమారి సోకినట్లుగా నిర్ధారణ కాగా వారిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అదే ఇంట్లో రియా కపూర్‌, తన భర్త కరణ్‌ బూలానీకి కూడా కరోనా సోకడంతో బీఎంఎంసీ ఆ ఇంటికి సీల్ వేసింది.

2021 Tollywood Heroins: తొలి సినిమాతోనే అదుర్స్ అనిపించుకున్న హీరోయిన్స్!

ఇక డిసెంబర్ 30న మరో సెలబ్రిటీ తనకు కరోనా సోకినట్లుగా ప్రకటించింది. మరో బాలీవుడ్‌ నటి నోరా ఫతేహీకి కరోనా నిర్థారణ అయినట్లు ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో ప్రకటించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ షేర్‌ చేసిన నోరా.. ‘ప్రస్తుతం నేను కరోనాతో పోరాడుతున్నా. నిజం చెప్పాలంటే ఈ వైరస్‌ నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. గత కొద్ది రోజులుగా బెడ్‌కే పరిమితయ్యాను. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నా. దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి…

Salman Khan: భాయ్‌జాన్ బిజీబిజీ.. ఒకవైపు సోలో సినిమాలు మరోవైపు మల్టీస్టారర్‌లు!

మాస్కులు ధరించండి. వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ప్రతి ఒక్కరి వివిధ రకాలుగా ప్రభావం చూపిస్తుంది. ఈ వైరస్ ప్రభావం నాపై తీవ్రంగా చూపించింది. ఇది ఎవరికైనా రావచ్చు.. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.. ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. జాగ్రత్తగా ఉండండి.. సురక్షితంగా ఉండండి ” అంటూ తెలియజేసింది నోరా ఫతేహి. బాలీవుడ్ లో కరోనా మహమ్మారి విజృంభణతో బీటౌన్ హడలెత్తిపోతుంది.