కరోనా లేదు..బాగానే ఉన్నా – జాకీ చాన్

  • Published By: madhu ,Published On : March 5, 2020 / 03:52 AM IST
కరోనా లేదు..బాగానే ఉన్నా – జాకీ చాన్

Updated On : March 5, 2020 / 3:52 AM IST

కరోనా..కరోనా..ఎక్కడ చూసిన ఇదే చర్చ. నలుగురు కలిసిన చోట ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకొని ప్రముఖ వ్యక్తులు సైతం ఈ వైరస్‌కు తెగ భయపడిపోతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా పాకింది. వేలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మనుషులకే కాదు..ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోంది. సినీ పరిశ్రమపై కూడా ఈ వైరస్ ఎఫెక్ట్ పడింది.

వివిధ దేశాల్లో ఉన్న వారు ఉన్నఫళంగా తిరిగివచ్చేస్తున్నారు. దీనిపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కానీ వేరే వారికి వైరస్ లేకున్నా..ఉందంటూ..ప్రచారం జరుగుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా యాక్షన్ హీరో జాకీచాన్‌కు కరోనా వైరస్ సోకిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి దీనికి సంబంధించిన వార్త హల్ చల్ చేస్తోంది.(భారత్‌లో వేడి వాతావరణం కరోనాను అడ్డుకోగలదా? సైంటిస్టులు ఏమంటున్నారు?)

హంకాంగ్‌లో మొదలైన ఈ వార్త చక్కర్లు కొట్టింది. సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యాయి. ఇంకేముంది..అభిమాన స్టార్ త్వరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున పరామర్శలు వెల్లువెత్తాయి. గెట్ వెల్ సూన్ అంటూ..సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. చివరకు ఈ విషయం జాకీ చాన్ దృష్టిలో పడింది. తాను బాగానే ఉన్నాను కదా..ఈ పుకారు ఎలా పుట్టింది ? అంటూ ఆలోచించారు. చివరకు ఆయన రెస్పాండ్ అయ్యారు. తాను బాగానే ఉన్నానని, తనకు కరోనా వైరస్ సోకినట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ ప్రకటించాల్సి వచ్చింది. 
Read More : ఉపాధ్యాయుల కోసం అసోం ప్రత్యేక చట్టం