Bholaa Shankar : చిరంజీవి భోళాశంకర్ రిలీజ్ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..?
చిరంజీవి భోళా శంకర్ రిలీజ్ పై వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ కేసు నమోదు చేశారు. ఎందుకో తెలుసా..?

court petition filed on chiranjeevi Bholaa Shankar release
Bholaa Shankar : చిరంజీవి (Chiranjeevi) నటించిన భోళాశంకర్.. ఈ శుక్రవారం ఆగష్టు 11న రిలీజ్ కాబోతుంది. దీంతో మెగాస్టార్ తో సహా మూవీ టీం అంతా ప్రమోషన్స్ తో సందడి చేస్తూ వస్తున్నారు. అంతా బాగుంది అని అనుకున్న సమయంలో మూవీ రిలీజ్ కి ఒక అడ్డంకి వచ్చి పడింది. అది కూడా అఖిల్ నటించిన ‘ఏజెంట్’ రూపంలో వచ్చి పడింది. ఏప్రిల్ లో ఏజెంట్ భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ తో సహా ప్రతి ఒక్కరు నష్టపోయారు.
Allu Arjun : అల్లు అర్జున్ కూతురు అర్హ.. మొదటిరోజు స్కూల్ ఫోటో చూశారా..?
ఈక్రమంలోనే విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్).. ఏజెంట్ విషయంలో నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ ను కూడా విడుదల చేశారు. ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలకు ఐదు సంవత్సరాల పాటు వైజాగ్ సతీష్ చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తూ నిర్మాతలు సతీష్ నుంచి 30 కోట్ల రూపాయలు తీసుకోని అగ్రిమెంట్ రాసి ఇచ్చారట. అయితే విడుదల సమయంలో సతీష్ కి కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే అందజేశారు.
Guntur Kaaram : గుంటూరు కారం అప్డేట్.. లుంగీ కట్టిన బాబు.. సంక్రాంతికి రిలీజ్ పక్కా..
ఈ విషయం పై నిర్మాతలను ప్రశ్నించగా.. “సామజవరగమన” చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను విశాఖపట్నం వరకు ఇచ్చారు. అయితే దాని నుంచి కూడా కొద్ది డబ్బు మాత్రమే నాకు కవర్ అయ్యింది. మిగిలిన బ్యాలన్స్ అమౌంట్ 45 రోజుల్లో చెల్లిస్తామని చెప్పి.. ఇప్పుడు రెస్పొంద్ అవ్వడం లేదట. అంతేకాకుండా నిర్మాతలు వైజాగ్ సతీష్ పై ఫోర్జరీ నింద వేశారట. దీంతో సహనం చచ్చిపోయిన డిస్ట్రిబ్యూటర్ AK ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న భోళా శంకర్ రిలీజ్ పై కేసు వేసినట్లు వెల్లడించారు. మరి దీని పై కోర్ట్ ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలి.