Skanda Song : స్కంద నుంచి కల్ట్ మామ వచ్చేశాడు.. ఊర్వశి రౌతేలా స్పెషల్ పర్ఫార్మెన్స్..

ఇప్పటికే స్కంద నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా మరో స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు.

Skanda Song : స్కంద నుంచి కల్ట్ మామ వచ్చేశాడు.. ఊర్వశి రౌతేలా స్పెషల్ పర్ఫార్మెన్స్..

Cult Mama Song Released from Ram Boyapati Skanda Movie Urvashi Rautela Special Performance

Updated On : September 18, 2023 / 12:09 PM IST

Skanda Movie Song :  ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి(Boyapati) కాంబినేషన్లో ‘స్కంద’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి కమర్షియల్ ఎంటర్టైన్ గా ఈ సినిమా ఉండబోతుంది. ఇందులో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తుండగా సయీ మంజ్రేకర్ ఓ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఫుల్ మాస్ తో ప్రేక్షకులని మెప్పించింది.

స్కంద సినిమాని 28 సెప్టెంబర్ 2023న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించారు. ఇప్పటికే స్కంద నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా మరో స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. కల్ట్ మామ.. అని సాగే ఈ సాంగ్ లో ఊర్వశి రౌతేలా స్పెషల్ పర్ఫార్మెన్స్ చేసింది. మాస్ బీట్ తో థమన్ అదరగొట్టాడు.